Site icon Prime9

PM Modi France visit: రెండురోజుల ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ

PM Modi France visit

PM Modi France visit

PM Modi France visit: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లారు. మోదీ రెండు రోజుల పాటు (జూలై 13 , 14) ఫ్రాన్స్ లో పర్యటిస్తారు.జూలై 14 (శుక్రవారం), 269 మంది సభ్యులతో కూడిన భారతీయ త్రి-సేవా దళం పాల్గొనే వార్షిక బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారు.రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం మరియు పెట్టుబడులతో సహా పలు కీలక రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చర్చలు జరుపుతారు.

పారిస్ కు వెడుతున్నాను..(PM Modi France visit)

పారిస్‌కు బయలుదేరి వెడుతున్నాను. అక్కడ నేను బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొంటాను. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరియు ఇతర ఫ్రెంచ్ ప్రముఖులతో ఉత్పాదక చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇతర కార్యక్రమాలలో భారతీయ సమాజంతో ఇంటరాక్ట్ అవుతానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసారు. ప్రధాని మోదీ తన యూఏఈ పర్యటన గురించి కూడా ప్రస్తావించారు. 15వ తేదీన, నేను అధికారిక పర్యటన కోసం యూఏఈ లో ఉంటాను. నేను షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో చర్చలు జరుపుతాను. మా పరస్పర చర్యలు భారతదేశానికి బలం చేకూరుస్తాయని నేను విశ్వసిస్తున్నాను. భారత్ – యుఎఇ స్నేహం మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మోదీ పేర్కొన్నారు.

 మోదీ షెడ్యూల్..

12:30 PM: పారిస్ చేరుకుంటారు.

16:05 PM: సెనేట్ అధ్యక్షుడితో సమావేశం

17:15 PM: ఫ్రాన్స్ ప్రధానితో సమావేశం

19:35 PM: లా సీన్ మ్యూజికేల్‌లో కమ్యూనిటీ ఈవెంట్

21:00 PM: అధ్యక్షుడు మాక్రాన్ హోస్ట్ చేసిన ప్రైవేట్ డిన్నర్ లో పాల్గొంటారు.

శుక్రవారం ప్రధాని మోదీ అబుదాబికి చేరుకుంటారు. అక్కడ యుఎఇ అధ్యక్షుడు మరియు అబుదాబి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో చర్చలు జరుపుతారు.
భారతదేశం-యుఎఇ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం క్రమంగా బలపడుతోంది. ఇంధనం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఫిన్‌టెక్, రక్షణ మరియు సంస్కృతి వంటి వివిధ రంగాల్లో దీనిని ముందుకు తీసుకెళ్లే మార్గాలను గుర్తించడానికి మోదీ పర్యటన ఒక అవకాశం అని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. .

 

Exit mobile version
Skip to toolbar