Site icon Prime9

President Droupadi Murmu: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu addresses Parliament Union Budget-2025: ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్ మారనుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశాభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, గత ప్రభుత్వాల పాలనతో పోల్చితే.. దాదాపు మూడు రెట్లు అభివృద్ధి జరుగుతుందన్నారు.

ప్రధానంగా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దిశగా భారత్ అడుగులు వేస్తున్నామని ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు వివరించారు. పేదరిక నిర్మూలన కోసం ఎన్డీఏ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడంతో పాటు అర్హులందరికీ లబ్ధి జరిగేలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు.

అలాగే మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సైతం ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుందని, ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అడిషనల్‌గా మూడు కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించనున్నారు. దీంతో పాటు ఆయుష్మాన్ భారత కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తోందన్నారు.

అదే విధంగా భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యమన్నారు.. ఇప్పటికే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ను ప్రారంభించామని, భారత్ ఏఐ మిషన్‌ను మొదలుపెట్టామన్నారు. మహిళలకు మంచి ఉపాధి లభిస్తుందన్నారు. బడ్జెట్‌లో మహిళలు, రైతులు, యువత, పేదలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని తెలిపారు.

 

 

Exit mobile version