Site icon Prime9

Delhi Chalo: ఉద్రిక్తంగా మారిన ‘ఢిల్లీ చలో’.. రైతులను అడ్డుకున్న పోలీసులు

Police Fire Tear Gas on Farmers at Shambhu Border: పంజాబ్, హర్యానా రాష్ట్రల మధ్య ఉన్న శంభు బారియర్ వద్ద న్యూఢిల్లీకి మార్చ్ చేస్తుండగా రైతులపై భాష్ఫవాయు ప్రయోగం జరిగింది. వారంతా తమ పంటకు సరైన గిట్టుబాటు ధరను కోరుతున్నారు. అయితే కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా బ్యానర్ కింద రైతుల ‘జఠా’ ఢిల్లీ పార్లమెంటు వైపు మార్చ్ నిర్వహించింది.

ఇవీ డిమాండ్లు..
పండించిన తమ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, విద్యుత్తు టారిఫ్ లు పెంచకూడదని, రుణ మాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పింఛన్లు ఇవ్వాలని, లఖింపూర్ ఖేరి లో 2021లో జరిగిన హింసాకాండలో బాధితులైన వారికి న్యాయం జరగాలన్నది రైతుల డిమాండ్. శంభు బార్డర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట కు రైతుల నిరసన మొదలు కాగా.. హర్యానాలోని అంబాల జిల్లాలో ఉన్న శంభు బార్డర్ వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు అదనపు బలగాలను మోహరించారు. అయితే రైతులు ముందస్తుగా అనుమతి తీసుకోలేదని పోలీసులు వాదించారు. అనేక చోట్ల పోలీసులను మోహరించారు. ఇక హర్యానాలోని కీలక రైతు సంఘాలు ‘ఢిల్లీ ఛలో’ ఉద్యమాన్ని చేపట్టాయి. దీంతో పోలీసులు వారిపై భాష్ప వాయు ప్రయోగించి అడ్డుకున్నారు.

కేంద్రానికి గడువు..
పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు గాయపడ్డారు. దీంతో మార్చ్ వాయిదా వేస్తున్నట్లు రైతులు ప్రకటించారు. ఇందుకోసం శనివారం ప్రత్యేకంగా చర్చలు చేసేందుకు రైతులు కేంద్రానికి సమయం ఇచ్చారు. డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే.. ఆదివారం మధ్యాహ్నం 12.00 గంటలకు ఢిల్లీ మార్చ్ పాదయాత్ర ఉంటుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.

సభలో మంత్రి హామీ
రైతుల నిరసనలు, దేశ రాజధాని ఢిల్లీకి పెద్ద ఎత్తున రైతుల సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభలో అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే రైతుల అన్ని ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, ఇది మోదీ ప్రభుత్వం, మోీద హామీని నెరవేర్చే హామీ’ అంటూ చౌహాన్ సభలో తెలిపారు. ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేమని గతంలో కాంగ్రెస్‌ చెప్పిందని చౌహాన్‌ సభకు వివరించారు. కానీ, మోదీ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు, సోయాబీన్‌, జొన్న పంటలకు ఉత్పత్తి ధరకంటే 50 శాతం అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తోందని వివరించారు.

Exit mobile version