Site icon Prime9

PM Narendra Modi : కాంగ్రెస్ నన్ను 91 సార్లు ధూషించింది – ప్రధాని నరేంద్ర మోదీ

pm narendra modi shocking comments on congress party

pm narendra modi shocking comments on congress party

PM Narendra Modi : కర్ణాటకలో ఎన్నికల రణరంగం తారాస్థాయికి చేరింది. ఈ తరుణంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు.. ప్రతి విమర్శలతో ఎలక్షన్ హీట్ ని మరింత పెంచుతున్నాయి. ఈ మేరకు తాజాగా కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించారు.  బీదర్ జిల్లాలోని హమ్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ విపక్ష కాంగ్రెస్‌పై మండిపడ్డారు. విపక్ష పార్టీ ఇప్పటి వరకు తనను 91 సార్లు దూషించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అలా చేసిన ప్రతీసారి ఆ పార్టీ కుప్పకూలిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటక పూర్తిగా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కానీ తాను మాత్రం కర్ణాటక ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు.

అదే విధంగా వారు లింగాయత్ వర్గాన్ని నిందించారని, అంబేడ్కర్,వీర్‌ సావర్కర్‌ను అవమానించారని, వారి నిందలకు ప్రజలు ఓట్లతో తప్పకుండా బదులిస్తారని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీపై ఎంత బురదజల్లితే.. కమలం అంతగా వికసిస్తుందని కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ అన్నారు. కర్నాటకను దేశంలోనే నంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే .. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని.. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటే – డబుల్ ప్రయోజనం, రెట్టింపు వేగమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్ణాటకకు ఏటా దాదాపు రూ.30 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చేవని, బీజేపీ ప్రభుత్వ హయాంలో కర్ణాటకకు ఏటా దాదాపు రూ.90 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

కర్ణాటకలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కేవలం ఐదేళ్ల ప్రభుత్వం ఏర్పాటుకు కాదని.. దేశంలో ఆ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం కోసమని ప్రధాని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమైందని ఆయన తెలిపారు. కన్నడ రైతులు, ప్రజలకు కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు మాత్రమే చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే బీజేపీ హయాంలో విదేశీ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయన్నారు. కర్ణాటకలో రెట్టింపు వేగంతో రెండంకెల అభివృద్ధి జరుగుతోందని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే.. రాష్ట్రం డబుల్‌ స్పీడ్‌ దూసుకెళ్తుందన్నారు.

బీజేపీ అధికారంలో కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారు – మోదీ (PM Narendra Modi)

బీజేపీ అధికారంలో కర్ణాటకలో రెట్టింపు వేగంతో అభివృద్ధి జరుగుతోందన్నారు ప్రధాని. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే.. రెండింతల వేగంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకపోతుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదలకు ఇళ్ల నిర్మాణంలో వేగం తగ్గించిందనీ, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 9 లక్షల పక్కా ఇండ్లను నిర్మించాలని నిర్ణయించామనీ, కేవలం బీదర్‌లో దాదాపు 30,000 ఇళ్లను నిర్మించామనీ. అంటే.. బీదర్‌లో 30 వేల మంది సోదరీమణలు లక్షాధికారులయ్యారని అన్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీదర్ నుండి ప్రారంభించడం తన అదృష్టమనీ, ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిని అయినప్పుడు కూడా బీదర్ ప్రజల ఆశీర్వాదం పొందానని అన్నారు. అందుకే తాను బీదర్ నుండి ప్రచారం ప్రారంభించాననీ, పెద్ద సంఖ్యలో ప్రజలు తనను ఆశీర్వాదించడానికి రావడం చాలా సంతోషంగా ఉండన్నారు. కర్నాటకలో జరిగే ఈ ఎన్నికలు ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాదు, కర్ణాటకను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చే ఎన్నికలని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలోని ప్రతి మూల అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కర్ణాటక రైతులు, ప్రజలకు కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలను తిప్పికొట్టాలని, కాంగ్రెస్ హయాంతో పోలిస్తే.. తమ హయాంలో విదేశీ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయని ప్రధాని మోడీ అన్నారు.

 

Exit mobile version