PM Narendra Modi says india Will Be $5 Trillion Economy: దేశంలో ఆర్థిక ప్రగతికి అద్భుత అవకాశాలు ఉన్నాయని, త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవ స్థగా అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ‘బడ్జెట్ అనంతరం ఉద్యోగాలు, ఉపాధి కల్పన’పై జరిగిన వెబినార్‌లో మోదీ ప్రసగించారు.
ప్రధానంగా అందరిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం, ఆవిష్కరణలకు తోడ్పాటు అందించేలా ప్రోత్సాహం అందించాలన్నారు. ఉద్యోగాలు సృష్టించడం, ఆర్థిక వృద్ధి పెంచేందుకు ప్రజలు, ఆర్థిక వ్యవస్థ, కొత్త ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వాటాదారులను ప్రధాని మోదీ కోరారు.
2014న ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం దాదాపు 3 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించిందని పేర్కొన్నారు. అలాగే 1000 ఐటీఐలను అప్ గ్రేడ్ చేయడంతో పాటు 5 ఎక్స్ లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయం తీసుకుందన్నారు.