Prime9

PM Modi Visits Plane Crash Spot: నేడు అహ్మదాబాద్ కు ప్రధాని మోదీ.. ప్రమాద స్థలం పరిశీలన!

PM Modi Visits Plane Crash Spot Ahmedabad: ప్రధాని నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. కాగా నిన్న అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన 265 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికుల్లో 241 మంది కన్నుమూశారు. రమేశ్ విశ్వాస్ అనే వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. చనిపోయిన వారిలో 229 మంది ప్రయాణికులు కాగా, 12 మంది విమాన సిబ్బంది, ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నారు.

 

కాగా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా విమాన ప్రమాదంలో చనిపోయారు. ఓ మెడికల్ కాలేజీపై విమానం కూలిపోవడంతో మెడికల్ కాలేజీలో ఉన్న 24 మంది కూడా చనిపోయారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉండటంతో డీఎన్ఏ టెస్ట్ నిర్వహించి బాడీలను బంధువులకు అందించనున్నారు. ఇక విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. అయితే అహ్మదాబాద్ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఇప్పటికే హైలెవల్ కమిటీని నియమించింది. ప్రమాదాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై కమిటీ అధ్యయనం చేయనుంది.

 

Exit mobile version
Skip to toolbar