Site icon Prime9

PM Modi: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగి బీజేపీ వైపు చూస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ

PM Modi Meets Party Leaders From Southern State: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశం ఫొటోలతో మోడీ ‘ఎక్స్‌’లో తెలుగులో పోస్టు పెట్టారు.

‘తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం చాలా బాగా జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు. బీఆర్ఎస్ పాలన వల్ల ప్రజలకు ఇంకా గుర్తుంది. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు’అని మోడీ పేర్కొన్నారు.

Exit mobile version