PM Modi Meets: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కర్ణాటకలో పద్మ అవార్డు గ్రహీతలు తులసి గౌడ, సుక్రి బొమ్ము గౌడలను కలిశారు.కర్ణాటకలోని ముద్బిద్రిలో జరిగిన ర్యాలీలో ప్రధాని బుధవారం ప్రసంగించారు. అనంతరం ఇద్దరు మహిళలతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. తులసి గౌడ ప్రధాని మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించగా, ఆమెను ఆపి ఇద్దరు మహిళలకు నమస్కరించి వారి ఆశీర్వాదం కోరారు.
ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్..( PM Modi Meets)
కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త తులసి గౌడకు 2021లో పద్మశ్రీ అవార్డు లభించింది. 74 ఏళ్ల ఈ మహిళ కర్ణాటకలోని హలక్కీ ఆదివాసీ తెగకు చెందినది. పేద కుటుంబంలో పుట్టిపెద్దగా చదువుకోలేదు. అయినప్పటికీ, మొక్కలు, మూలికలు మరియు చెట్లపై ఆమెకున్న జ్ఞానం అపారం. అందుకే ఆమె ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్’గా పిలువబడింది.అటవీ ప్రాంతంలో పెరిగిన గౌడకు చిన్నప్పటి నుంచి చెట్లు, మొక్కల గురించి తెలుసుకోవాలనే తపన ఉండేది. ఆమె వేలాది చెట్లను నాటి వాటిని పెంచింది. అటవీ శాఖలో తాత్కాలిక వాలంటీర్‌గా కూడా చేరింది. గౌడ యొక్క అంకితభావం, జ్ఞానం మరియు చెట్ల పరిరక్షణ కోసం ఆమె తపన గుర్తించి అటవీశాఖలో పర్మినెంట్ ఉద్యోగం కల్పించారు.
నైటింగేల్ ఆఫ్ హలక్కీ..
సుక్రీ బొమ్ము గౌడ్, సుల్క్రజ్జీగా ప్రసిద్ధి చెందారు. ఆమె 2017లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.ఉత్తర కన్నడలోని హలక్కీ తెగకు చెందిన ఈ మహిళ నైటింగేల్ అని ప్రసిద్ధి చెందింది,పాటల భాండాగారంగా పరిగణించబడుతుంది. వివాహం, పుట్టుక, పండుగ, పంట మరియు ఇతర సందర్బాల్లో పాటలను పాడుతూ ఉంటుంది. 1989లో కర్ణాటక జానపద యక్షగాన అకాడమీ అవార్డు, 1998లో కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు, 1999లో జానపద అకాడమీ జానపద శ్రీ అవార్డు, 2003లో సహ్యాద్రి కన్నడ సంఘ అడిగ అవార్డు, 2004లో సందేశ్ ప్రశస్తి సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. వెయ్యికి పైగా పాటలు పాడిన గౌడ హలక్కీ వొక్కల్ తెగకు చెందిన ప్రముఖులలో ఒకరు.