PM Modi meets Bangladesh Chief Adviser Yunus: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వయిజర్ హమ్మద్ యునుస్‌లు మొట్టమొదటిసారి శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకాక్‌లోని షాంగ్రిలా హోటల్‌లో కలుసుకున్నారు. ఇరువురు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అయితే అధికారికంగా ఇరువురి మధ్య జరిగిన చర్చల వివరాలు మాత్రం తెలియారాలేదు. కానీ విశ్వసనీయవర్గాల సమాచారం యునుస్ షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని డిమండ్ చేస్తే.. మోదీ బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులు.. అత్యాచారాల గురించి నిలదీసినట్లు చెబుతున్నారు.
బంగ్లాదేశ్‌లో షేక హసీనా ప్రభుత్వం కుప్పకూలి ఎనిమిది నెలలు దాటిపోయింది. ప్రస్తుతం ఆమె ఇండియాలోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇండియాపై ఒత్తిడి పెంచుతోంది. ఆమెపై బంగ్లాదేశ్ కోర్టుల్లో పలు కేసులను ఎదుర్కొవాల్సి ఉందని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. దీనికి ప్రధానమత్రి నరేంద్రమోదీ కూడా బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి యునుస్‌ను నిలదీశారని చెబుతున్నారు. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు కానీ.. విశ్వసనీయవర్గాల ద్వారా కొంత సమాచారం తెలిసింది. అయితే బంగ్లాదేశ్ గత మూడు వారాల నుంచి మోదీతో యునుస్ సమావేశం గురించి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. అయితే ఇండియా మాత్రం దీనిపై పెదవి విప్పలేదు. అయితే సమావేశానికి రెండు రోజుల ముందు ఢాకా బహిరంగంగానే మోదీతో బ్యాంకాక్‌లో జరుగుతున్న బే ఆఫ్ బెంగాల్ ఇనిషేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్ లేదా బిమ్స్‌టెక్ సదస్సులో బేటీ కావడానికి అనుమతించారని పేర్కొంది. కాగా బ్యాంక్‌లో శుక్రవారం బిమ్స్‌టెక్ సదస్సు ముగిసింది.
బ్యాంకాక్‌లో మోదీతో సమావేశం పట్ల బంగ్లాదేశ్ సంతృప్తి వ్యక్తం చేసింది. యునుస్ మోదీకి ఒక ఫోటోగ్రాప్ ఇచ్చారని భారత ప్రధానమంత్రి హోదాలో మోదీ 2015 జనవరిలో యునుస్‌కు గోల్డ్ మెడల్ ఇచ్చిన ఫోటోను యునుస్ మోదీకి బహుకరించారు. అలాగే బంగ్లాదేశ్‌కు ఇండియా చేసిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు. 1971లో అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్‌ను ఇండియా ఆదుకుందని గుర్తు చేశారు. ఇరువురు నాయకుల సమావేశం తర్వాత విదేశాంగమంత్రి విక్రం మిస్ర్తీ మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్‌తో బలమైన సంబంధాలను ఇండియా కోరుకుంటుందని చెప్పారు. బంగ్లాదేశలో ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని స్థిరమైన ప్రభుత్వాన్ని శాంతియుత, ప్రగతిశీల మరియు సమగ్ర బంగ్లాదేశ్‌ను కోరుకుంటుందని మోదీ యునుస్‌తో అన్నారని మిస్ర్తీ వివరించారు. అలాగే బంగ్లాదేశ్ ఇండియాను రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడరాదని .. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించుకుందామని యునుస్‌కు మోదీ సూచించారని మిస్ర్తీ మీడియతో చెప్పారు.
ఈ సమావేశంలోనే మోదీ బంగ్లాదేశ్‌లో ఉన్న మైనార్టీల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా షేక్‌హసీనా ఇండియాకు వచ్చిన తర్వాత జరిగిన అల్లర్లలో ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. వారి మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని మోదీ కోరారు. హిందువులపై జరిగిన దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా మోదీ దీనిపై సుదీర్ఘంగా మాట్లాడారు. మైనార్టీ హిందువులపై దాడులు జరిగితే దాని ప్రభావం ఇండియాలో తీవ్రంగా ఉంటుందని యునుస్‌కు వివరించారు. దీనికి బంగ్లాదేశ్ చీఫ్ అడ్వయిజర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో .. హిందువులపై జరిగిన దాడులను గోరంతను కొండంతలు చేసి చూపిస్తున్నారని .. దాదాపు ఇవన్నీ ఫేక్ న్యూస్ అని వాదించింది. కావాలనుకుంటే ఇండియా నుంచి మీడియా ప్రతినిధలు వచ్చి ఇక్కడ జరిగిన ఘటనలపై విచారణ చేసుకోవచ్చునని ఆఫర్ కూడా చేసింది. కాగా యునుస్ ప్రభుత్వం అధికారులు మాత్రం మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని. మతపరమైన సంఘటనలు జరిగినా.. అలాగే మైనార్టీలపై జరుగుతున్న హింసను తీవ్రంగా పరిగణిస్తోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ విదేశాంగమంత్రిత్వశాఖ కూడా ఒక ప్రకటనలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మరాదని ఇండియాను కోరింది.
ఇక యునుస్‌కు దేశంలో లెక్కలేనన్ని సమస్యలున్నా.. ఆయన మాత్రం షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తుఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఒకసారి బంగ్లాదేశ్ ఇండియాను అధికారికంగా కోరింది. షేక్ హసీనా దిల్లీలో కూర్చుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ తాత్కాలిక ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు గుప్పిస్తున్నారని యునుస్ మండిపడ్డారు. ఆమె ప్రసంగాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ బంగ్లాదేశ్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని యునుస్ భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆమె ఇండియాలో కూర్చుని రెట్టగొట్టే ప్రసంగాలు చేయరాదని ఇండియా ఆమె అదుపులో పెట్టాలని కోరింది. ఇక మిస్ర్తీ కూడా షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలనే డిమాండ్‌ను యునుస్ మోదీ ముందు పెట్టారని అంగీరించారు. అయితే దీనిపై మోదీ ఎలా స్పందించారనే విషయం గురించి చెప్పడానికి ఆయన నిరాకరించారు. దీనిపై తాను ఇప్పడు కామెంట్ చేయడం బాగుండదని ఆయన ప్రశ్నను దాటవేశారు.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ పౌరులను భారత సరిహద్దు భద్రతా దళాలు కాల్చి చంపుతున్నాయని ఫిర్యాదు చేశారు యునుస్. దీనికి మోదీ స్పందిస్తూ సరిహద్దులను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇండియా సరిహద్దు విధానాలను మోదీ సమర్థించుకున్నారు. సరిహద్దు నుంచి ఇండియాలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా రాత్రిపూట చొరబాటులు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఇండియా బంగ్లాదేశ్‌కు సూచించింది. సరిహద్దుల్లో జరుగుతున్న అక్రమ చొరబాటులపై తరచూ ఇరుదేశాలు కలిసి చర్చించుకోవాలనే ప్రతిపాదనను ఇండియా తీసుకువచ్చింది. బంగ్లాదేశ్‌లో ఎన్నికల గురించి మోదీ ప్రస్తావించారు. ప్రజాస్వామ్య దేశంలో తరచూ ఎన్నికలు జరగాల్సిందేనని అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామన్నారు ప్రధాని.
కాగా యునుస్ గంగాజలాల పంపిణి ఒప్పందం వచ్చే ఏడాదితో ముగియనుంది. దీన్ని పునరుద్ధరించాలని.. అలాగే తీస్తా నీటీ పంపకం ఒప్పందం పై తుది నిర్ణయం తీసుకవాలని బంగ్లాదేశ్ కోరింది. కాగా కొన్ని దశాబ్దాల నుంచి ఇవి పెండిగ్‌లోనే ఉన్నాయి. అలాగే బంగ్లాదేశ్‌తో ఇండియా స్వేచ్చా వాణిజ్య ఒప్పందానికి మద్దతు తెలపాలని కోరింది బంగ్లా ప్రభుత్వం. కాగా బిమ్‌స్టిక్ చైర్మన్ షిఫ్ తమకు దక్కేందుకు మద్దతు ఇవ్వాలని యునుస్ ప్రధానిని కోరారు. దానికి మోదీ అంగీకరించారు. అలాగే యునుస్ సార్క్‌ను సమావేశాలను పునరుద్దరించాలని కోరారు. ఇక అసలు విషయానికి వస్తే షేక్ హసీనాను అప్పగించాలని యునుస్ డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు కానీ.. దానికి మోదీ ఎలా స్పందించాలరనే విషయం మాత్రం సప్పెన్స్‌గా మారింది. బంగ్లాదేశ్ అధికారికంగా చెబితే కానీ వాస్తవాలు బహిర్గతం అయ్యే అవకాశాల్లేవు.