Site icon Prime9

PM Modi in Varanasi: వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

PM Modi in Varanasi

PM Modi in Varanasi

PM Modi in Varanasi:ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ వేశారు . వారణాసి నుంచి లోక్ సభ కు మోడీ పోటీచేస్తున్న విషయం తెలిసిందే . మోదీ నామినేషన్ కార్యక్రమాని ఎన్డీయే మిత్ర పక్ష నాయకులు సైతం హాజరయ్యారు .మోడీ నామినేషన్ కు హాజరైన వాళ్ళల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జితన్ రామ్ మాంఝీ, ఓంప్రకాష్ రాజ్‌భర్, సంజయ్ నిషాద్, ఎన్‌డిఎ కూటమికి చెందిన రాందాస్ అథవాలే వున్నారు.

గంగానదికి హారతి..(PM Modi in Varanasi)

నామినేషన్ వేయడానికి ముందు మోదీ కాల భైరవుడికి ప్రార్థనలు చేశారు. తదనంతరం గంగానది దశాశ్వమేధ ఘాట్‌ వద్ద పూజలు చేసి గంగా హారతి ఇచ్చారు. అక్కడ నుంచి నేరుగా వారణాసి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి నుంచి లోక్ సభ ఎంపీ మోదీ పోటీ చేయడం ఇది మూడో సారి. 2024 లోక్ సభ ఎలక్షన్ లో జూన్ 1న ఇక్కడ చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వస్తాయి.

 

Exit mobile version