Ram Charan In G20 Summit : జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిన జీ 20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. జీ20 సమ్మిట్‌లో ఓ సినిమా సెలబ్రిటీ పాల్గొనడం అరుదైన విషయం. మే 22 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న జీ20 సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు. ఇందులో మన దేశం నుంచి తెలుగు నటుడు అయిన రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహించడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని చెప్పాలి. ఈ సందర్భంగా చరణ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ మారాయి.