Defence items: 928 రక్షణ వస్తువులపై దశలవారీగా దిగుమతి నిషేధం

రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్దికోసం డిసెంబర్ 2023 మరియు డిసెంబర్ 2029 మధ్య దశలవారీగా దిగుమతి నిషేధం కిందకు వచ్చే లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు, సబ్-సిస్టమ్‌లు మరియు విడిభాగాలతో సహా 928 సైనిక వస్తువుల తాజా జాబితాను భారతదేశం ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 06:58 PM IST

Defence items: రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్దికోసం డిసెంబర్ 2023 మరియు డిసెంబర్ 2029 మధ్య దశలవారీగా దిగుమతి నిషేధం కిందకు వచ్చే లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు, సబ్-సిస్టమ్‌లు మరియు విడిభాగాలతో సహా 928 సైనిక వస్తువుల తాజా జాబితాను భారతదేశం ప్రకటించింది. వీటిలో యుద్ధ విమానాలు, శిక్షణా విమానాలు, యుద్ధనౌకలు మరియు వివిధ రకాల మందుగుండు సామగ్రిలో ఉపయోగించే వస్తువులు ఉన్నాయి.

ఈ వస్తువుల దిగుమతి విలువ రూ.715 కోట్లు..(Defence items)

ఇది గత రెండేళ్లుగా దిగుమతి నిషేధంలో ఉంచబడిన రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు (DPSUలు) ఉపయోగించే వ్యూహాత్మకంగా ముఖ్యమైన భాగాల యొక్క నాల్గవ ‘సానుకూల స్వదేశీ జాబితా. మునుపటి జాబితాలను రక్షణ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2021లో ప్రచురించింది. కొత్త జాబితాలో చేర్చబడిన వస్తువుల దిగుమతి ప్రత్యామ్నాయం విలువ రూ.715 కోట్లు అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ వస్తువులను నిర్దేశించిన సమయపాలన తర్వాత మాత్రమే భారతీయ పరిశ్రమ నుండి కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు. తాజా జాబితా లో సుఖోయ్-30 మరియు జాగ్వార్ యుద్ధ విమానాలు, హిందుస్థాన్ టర్బో ట్రైనర్-40 (HTT-40) విమానాలు, బోర్డు యుద్ధనౌకలలో మ్యాగజైన్ అగ్నిమాపక వ్యవస్థలు మరియు గ్యాస్ టర్బైన్ జనరేటర్లలోని అనేక భాగాలు ఉన్నాయి. మునుపటి జాబితాలలోని భాగాలు మరియు ఉప-వ్యవస్థలలో ఫైటర్ జెట్‌లు, డోర్నియర్-228 విమానాలు, జలాంతర్గాముల కోసం బహుళ వ్యవస్థలు, T-90 మరియు అర్జున్ ట్యాంకుల కోసం పరికరాలు, BMP-II పదాతిదళ పోరాట వాహనాలు, యుద్ధనౌకలు మరియు జలాంతర్గాములు మరియు యాంటీ- ట్యాంక్ క్షిపణులు ఉన్నాయి.

ఆర్దిక వ్యవస్ద వృద్దికి ఊతం..

మునుపటి మూడు జాబితాలలోని దాదాపు 2,500 వస్తువులు ఇప్పటికే స్వదేశీకరించబడ్డాయి. 2028-29 వరకు భారతదేశంలో దశలవారీగా 1,238 తయారీకి గుర్తించబడినట్లు అధికారులు తెలిపారు. ఈ 1,238 వస్తువులలో ఇప్పటివరకు 310 స్వదేశీకరించబడ్డాయి. రక్షణ ప్రభుత్వ రంగసంస్దలు ‘మేక్’ కేటగిరీ (మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌కి మూలస్తంభం) కింద వివిధ మార్గాల ద్వారా ఈ వస్తువుల స్వదేశీకరణను చేపట్టాయి. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు) మరియు ప్రైవేట్ భారతీయ పరిశ్రమల సామర్థ్యాల ద్వారా అంతర్గత అభివృద్ధిని చేపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థలో వృద్ధికి ఊతమివ్వడం, రక్షణలో మెరుగైన పెట్టుబడులు మరియు ప్రభుత్వ రంగ సంస్దలు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.