Site icon Prime9

Patna Opposition Meet: పాట్నా సమావేశంలో మేమంతా కలిసి ఉన్నామంటూ చెప్పిన ప్రతిపక్ష నేతలు

Patna Opposition Meet

Patna Opposition Meet

 Patna Opposition Meet: పాట్నాలో  శుక్రవారం  2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి నాయకులు సమావేశమయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వీ యాదవ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్‌కు చెందిన భగవంత్ మాన్, తమిళనాడుకు చెందిన ఎంకే స్టాలిన్, జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.

జూలైలో సిమ్లాలో మరోసారి సమావేశం..( Patna Opposition Meet)

2024లో భాజపాతో పోరాడేందుకు ఆయా రాష్ట్రాల్లో ఎలా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనే దానిపై ఎజెండాను సిద్ధం చేసేందుకు జూలైలో సిమ్లాలో మరోసారి సమావేశమవుతాం అని పాట్నాలో విపక్షాల సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య సంస్థలపై జరిగిన దాడిని రాహుల్ గాంధీ లేవనెత్తారు. ఇది సిద్ధాంతాల పోరాటం. మాకు కొన్ని విభేదాలు ఉండవచ్చు, కానీ మా భావజాలాన్ని కాపాడుకోవడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాము. ఇది ఒక ప్రక్రియ, మరియు మేము దానిని కొనసాగిస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరైన పార్టీలు ఒక్కటిగా పోరాడతాయని స్పష్టం చేశారు.
పాట్నా నుండి మొదలయ్యేది జన ఆందోళనగా మారుతుంది అని బెనర్జీ ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశాలు ఫలితం ఇవ్వలేదని ఆమె అన్నారు.

మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనా సేవలపై నియంత్రణను తీసివేసే కేంద్రం యొక్క వివాదాస్పద ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ బహిరంగంగా వ్యతిరేకించే వరకు భవిష్యత్తులో ప్రతిపక్ష సమావేశాలలో భాగం కామని పేర్కొంది.

Exit mobile version