Site icon Prime9

Rajnath Singh: ఆక్రమిత కశ్మీర్ ప్రజలపై అఘాయిత్యాలు.. పర్యవసానాలను పాకిస్థాన్ భరించాల్సిందే.. రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్

Pakistan committing atrocities against people in PoK- they will have to bear its consequences

Pakistan committing atrocities against people in PoK- they will have to bear its consequences

Srinagar: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రజల పై అఘాయిత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యవసానాలను చవిచూడాల్సి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. వైమానిక దళం ఆద్వర్యంలో శ్రీనగర్ లో చేపట్టిన శౌర్య దివస్ కార్యక్రమంలో పాకిస్థాన్ పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో కేంద్రం అభివృద్ధి ప్రయాణాన్ని ప్రారంభించిందని, గిల్గిట్, బాల్టిస్థాన్ చేరిన తర్వాత ఆ లక్ష్యం పూర్తి అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 1947లో అక్టోబర్ 27న జమ్మూ, కళ్మీర్ ప్రాంతాలను భారతదేశంలోకి చేరిన సమయంలో భారత దళాలను జమ్మూలోకి ప్రవేశపెట్టిన ఎయిర్ క్రాఫ్ట్ ను ఈ సందర్భాన్ని గుర్తు చేస్తుందన్నారు. ఉగ్రవాదానికి మతం లేదు. వారి ఏకైక లక్ష్యం భారత్‌ను టార్గెట్ చేయడమే అని ఆయన అన్నారు.

2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్‌లో ప్రజల పట్ల వివక్షకు తెరపడిందన్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రజల పట్ల వివక్షను ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతమొందించారని రాజ్ నాధ్ సింగ్ అన్నారు.

ఇది కూడా చదవండి: Ministry of External affairs: భారత్ లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కమిటీ రెండు రోజుల సమావేశం.. హాజరుకానున్న బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి

Exit mobile version