Pak woman: గ్రేటర్ నోయిడా పోలీసులు సోమవారం ఒక పాకిస్తానీ మహిళ మరియు ఆమె నలుగురు పిల్లలను అక్రమంగా ఆశ్రయం పొందిన వ్యక్తిని అరెస్టు చేశారు. వీరిద్దరు ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ద్వారా కలుసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
గేమింగ్ ద్వారా పరిచయమై ప్రేమలో పడి..(Pak woman)
సీమా గులాం హైదర్ అనే పాకిస్తానీ మహిళ,సచిన అనే వ్యక్తి గేమింగ్ వేదికపై కలుసుకున్నారు. వారు వెబ్‌లో ఒకరితో ఒకరు చాట్ చేయడం ప్రారంభించి చివరికి ప్రేమలో పడ్డారు. దీనితో సీమా అతడికోసం తన నలుగురు పిల్లలను తీసుకుని నోయిడా వచ్చేసింది. మే నెలలో వీరు ఇంటిని అద్దెకు తీసుకున్నారని నివాసముంటున్న అపార్ట్‌మెంట్ యజమాని బ్రిజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. సచిన్, సీమాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది
లాయర్ మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సీమా పాకిస్తాన్‌లో గృహహింస బాధితురాలు. తనకు సౌదీ అరేబియాలో పనిచేసే ఒక పాకిస్థానీ వ్యక్తితో వివాహమైందని, అతను ప్రతి చిన్న విషయానికి తనను కొట్టేవాడని ఆమె చెప్పింది. నాలుగేళ్లుగా అతన్ని కలవలేదని ఆమె చెప్పింది. తన సోదరుడు పాకిస్తాన్ సైన్యంలో ఉన్నాడని కూడా చెప్పింది.