Site icon Prime9

Pahalgam Attack Effect: సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత.. టూరిస్ట్‌ ప్రాంతాల మూసివేత

Pahalgam Attack Effect Another Firing Again in India and Pakistan Border

Pahalgam Attack Effect Another Firing Again in India and Pakistan Border

Pahalgam Attack Effect Another Firing Again in India and Pakistan Border: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత వినిపించింది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు చేపట్టింది. ఇప్పటికీ పాకిస్థాన్ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కుప్వారా, బరాముల్లా జిల్లాలతో పాటు అభ్నూర్ సెక్టార్‌లో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకకు తెగబడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పాక్ పాల్పడిన ఈ అక్రమ కాల్పులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.

 

మరోవైపు, కాశ్మీర్ లోయలో టూరిస్ట్ ప్రాంతాలను మూసివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దాదాపు 48 టూరిస్ట్ ప్రాంతాలను మూసివేసినట్లు తెలుస్తోంది. 87 ప్రదేశాల్లో 48 టూరిస్ట్ ప్రాంతాలను మూసివేయగా.. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రత కల్పించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ మూసివేత టూరిస్ట్ ప్రాంతాల్లో త్వరలో భద్రత కల్పించనున్నారు. భద్రత కల్పించిన తర్వాతనే మూసివేసిన టూరిస్ట్ ప్రాంతాలను తిరిగి తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version
Skip to toolbar