Women Missing: మధ్యప్రదేశ్‌లో గత మూడేళ్లలో 31,000 మంది మహిళలు మరియు బాలికలు అదృశ్యమయ్యారని అధికారిక సమాచారం ద్వారా వెల్లడయింది. 2021 మరియు 2024 మధ్య రాష్ట్రంలో మొత్తం తప్పిపోయిన వారిలో 28,857 మంది మహిళలు, 2,944 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి బాలా బచ్చన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ గణాంకాలు వెల్లడించింది.
ప్రతిరోజూ 28 మంది మిస్సింగ్..(Women Missing)
వీటి ప్రకారం మధ్యప్రదేశ్‌లో ప్రతిరోజూ సగటున 28 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమవుతున్నారు. ఇదిలావుండగా అధికారికంగా 724 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఉజ్జయినిలో గత 34 నెలల్లో 676 మంది మహిళలు అదృశ్యమైనప్పటికీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.ఇదే ధోరణి సాగర్ జిల్లాలో ఉంది, ఇక్కడ 245 మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఇండోర్ జిల్లాలో అత్యధికంగా 2,384 మంది అదృశ్యమవగా కేవలం 16 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక్కడ అత్యధికంగా ఒక నెలలో 479 మిస్సింగ్ కేసులు ఉన్నాయి.
రెండేళ్లలో రెండు లక్షలమంది మిస్సింగ్..
మధ్యప్రదేశ్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తప్పిపోయిన పిల్లలతో పాటు మహిళలు మరియు బాలికల సంఖ్య అత్యధికంగా ఉంది. 2023 జూలైలో పార్లమెంటులో హోం మంత్రిత్వ శాఖ సమర్పించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం, 2019 మరియు 2021 మధ్య మధ్యప్రదేశ్‌లో దాదాపు 2 లక్షల మంది మహిళలు మరియు బాలికలు అదృశ్యమయ్యారు.మరే ఇతర రాష్ట్రాల్లో ఇన్ని కేసులు లేవు. 2022లో, ప్రతిరోజూ 32 మంది పిల్లలు కనిపించకుండా పోయారు, అందులో 24 మంది బాలికలు (75 శాతం) ఉండటం గమనార్హం.