Armaan Malik: ప్రస్తుతం చాలా మంది యూ ట్యూబ్ చానల్స్ పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో అర్మాన్ మాలిక్ ఒకరు. ఆయన లైప్ స్టయిల్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే ఆయన ఇటీవల సిద్దార్ధ కన్నన్ షోలో ప్రత్యక్షమయ్యారు. తన ఆదాయం, లైఫ్ స్టయిల్ తదితర అంశాలను చెప్పడంతో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయన కెరీర్ మెకానిక్‌తో మొదలైంది. అలాంటి వ్యక్తి యూ ట్యూబ్ చానల్ ప్రారంభించి పది ఫ్టాట్స్ కొనుగోలు చేయడం. కేవలం రెండున్నర సంవత్సరాల కాలంలో యూ ట్యూబ్ చానల్ పెట్టి సుమారు రెండు వందల కోట్ల రూపాయలను సంపాదించానని చెప్పాడు. తన జీవిత ప్రయాణం గురించి కూడా ప్రస్తావించాడు.
ఇద్దరు భార్యలు.. (Armaan Malik)
సిద్దార్ధకన్నన్ షోలో పాల్గొన్న అర్మాన్ తన ఇద్దరు భార్యలు క్రితిక, పాయల్‌లో కలిసి వచ్చాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. చిన్నప్పుడు పడ్డ కష్టాలు గురించి .. ఎనిమిద తరగతి రెండుసార్లు ఫెయిల్ కావడంతో వేరే గత్యంతరం లేక మెకానిక్‌గా జీవితం ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పాడు. గొప్ప చదువులు చదువుకుంలేనే పెళ్లి చేయాలనే నిర్ణయానికి తన తల్లి వచ్చిందన్నాడు. తనకే దిక్కులేదు. పెళ్లి చేసుకున్నతర్వాత భార్యను ఎలా పోషిస్తావని తల్లి అనేదని గత రోజులు గుర్తు చేసుకున్నాడు . ఎట్టకేలకు స్వయం కృషితో యూట్యూబ్ ద్వారా ఈ రోజు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్నాడు. జీవితమే మారిపోయింది. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు.
రెండువందల కోట్ల ఆస్తి..
తన నికర ఆస్తి సుమారు వంద నుంచి రెండు వందల కోట్ల వరకు ఉంటుందన్నాడు. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా తాను తన మూలాలను మాత్రం మరవనని అన్నాడు. తనకు మొత్తం పది ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పాడు. వాటిలో నాలుగు ప్లాట్‌లలో తన ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉంటారని చెప్పాడు. మిగిలిన ఆరు ఫ్లాట్స్ తనను నమ్ముకొని తన వెంటే నడుస్తున్న సిబ్బంది ఉంటారని చెప్పాడు. అత్యాధునిక స్టూడియోతో పాటు ఆరుగురు ఎడిటర్లు, ఇద్దరు డ్రైవర్లు, నలుగు పీఎస్‌యులు, తొమ్మిది మంది పనివారు తన మొత్తం టీం అని వివరించాడు.
ప్రస్తుతం ఉన్నత శిఖరాలకు చేరుకున్నా తాను తన తల్లిదండ్రులను మిస్ అవుతున్నానని చెబుతున్నాడు. వారి అండ, వారి గైడెన్స్‌ను కోల్పోయానన్న బాధ వెంటాడుతోందన్నారు. ప్రస్తుతం తన టీమ్ తన కుటుంబమన్నాడు. తన స్టాఫ్‌తో కలిసి హోలీ, దివాలీ జరుపుకుంటానని చెప్పాడు. ఈ రోజు తన తండ్రి బతికే ఉంటే తనను చూసి గర్వపడే వాడని, తన వద్ద పనిచేసే సిబ్బందే తన కుటుంబంగా భావిస్తానని చెప్పుకొచ్చాడు అర్మాన్ మాలిక్.