Site icon Prime9

UP Madarsa survey: యూపీలో ముస్లిం సెమినార్‌ లపై సర్వేలు.. మండిపడుతున్న విపక్షాలు

UP-Madarsa-survey

Lucknow: లక్నోలోని దారుల్‌ ఉలూమ్‌ నదావతుల ఉలేమాలో ముస్లింలు నిర్వహించే సెమినార్‌ల పై యూపీ సర్కార్ సర్వే నిర్వహించింది. ఇక్కడ నిర్వహించే సెమినార్‌లకు ప్రభుత్వం అనుమతి లేదని స్పష్టం చేసింది. జిల్లా మైనార్టీ అధికారి సోనే కుమార్‌తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే ద్వారా సెమీనార్‌కు సంబంధించిన సమాచారం సేకరించడంతో పాటు ఈ సెమినార్‌కు ఇతర సంస్థలతో అనుబంధం ఉందా అనే దానిపై విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.

మొత్తం 12 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించామని, వాటిలో సెమినార్‌ నిర్వహించే సంస్థ పేరు వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సెమినార్‌ నిర్వహించే సంస్థ ఎప్పడు ప్రారంభమైంది. సెమినార్‌కు వచ్చేవారికి ఎలాంటి సదుపాయాలు లభిస్తున్నాయి. విద్యుత్‌, మంచినీటితో పాటు ఎంత మంది విద్యార్థులు ఈ సెమినార్‌కు హాజరవుతున్నారు. దీంతో పాటు వారికి అందిస్తున్న కోర్సులు, వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీస్తున్నామన్నారు అధికారులు.

గత శనివారం నుంచి యూపీ ప్రభుత్వం ముస్లిం సెమినార్‌ల పై సర్వేలు మొదలుపెట్టింది. కాగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మాయావతి యోగీ సర్కార్‌పై మండిపడ్డారు. దురుద్దేశ పూరితంగా ముస్లింలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. కాగా ఈ సర్వేను ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డుతో పాటు జమైతే ఉలేమా ఈ హింద్‌ కూడా వ్యతిరేకించింది. అయితే ప్రభుత్వం మాత్రం తమ చర్యను సమర్ధించుకుంటోంది. ఈ సెమినార్‌లలో పాల్గొనే వారికి వసతులు లభిస్తున్నాయా లేదా అని పరిశీలించడానికి సర్వే నిర్వహిస్తున్నామని వివరణ ఇచ్చుకుంది.

Exit mobile version