Site icon Prime9

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో క్లెయిమ్ చేయని 28 మృతదేహాల దహనానికి ఏర్పాట్లు

Odisha Train Accident

Odisha Train Accident

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 297 మంది ప్రాణాలను బలిగొన్న రైలు ప్రమాదం జరిగిన నాలుగు నెలల తర్వాత కూడా 28 మృతదేహాలు మిగిలిపోయాయి. వీటిని ఎవరూ గుర్తు పట్టకపోవడం, క్లెయిమ్ చేయకపోవడంతో, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ( బీఎంసీ ) అధికారులు ఈ మృతదేహాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక అధికారి తెలిపారు.

సీబీఐ లేఖతో..(Odisha Train Accident)

28 మంది వ్యక్తుల అవశేషాలను శాస్త్రీయంగా పారవేసేందుకు పౌర సంస్థ ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని జారీ చేసిందని ఆయన చెప్పారు. రైలు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) మృతదేహాలను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేయాలని కోరుతూ ఖుర్దా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిన తర్వాత బీఎంసీ ఈ ప్రక్రియను ప్రారంభించింది. మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఉంచారు.నగరంలోని సత్యనగర్ మరియు భరత్‌పూర్‌లోని శ్మశాన వాటికలకు ఎయిమ్స్ నుండి మృతదేహాలను సాఫీగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు.మృతదేహాల దహన సంస్కారాల కోసం రాష్ట్ర, కేంద్రం, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ల ప్రస్తుత నియమాలు మరియు మార్గదర్శకాలను అనుసరించి ఎయిమ్స్ భువనేశ్వర్ డైరెక్టర్ అధికారికంగా మృతదేహాలను బీఎంసీ ఆరోగ్య అధికారికి అప్పగిస్తారని ఆయన చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ వీడియో-గ్రాఫ్ చేయబడుతుంది.

ఎయిమ్స్ భువనేశ్వర్‌కు 162 మృతదేహాలు లభించగా, వాటిలో 81 మృతదేహాలను మొదటి దశలో మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు.తరువాత డీఎన్ఏ పరీక్షల తరువాత మరో 53 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు, అయితే మరో 28 మంది మృతదేహాలను ఎవరూ క్లెయిమ్ చేయలేదు.

Exit mobile version