Site icon Prime9

Karnataka: అధికారులు వేధిస్తున్నారు, చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి.. రాష్ట్రపతికి దంపతులు లేఖ

Officials harass...give permission to die...Couple's letter to President

Shivamogga: భాజపా పాలిత రాష్ట్రం కర్ణాటకలో అధికారుల వేధింపులు తాళలేక దంపతుల జంట చనిపోయేందుకు నిశ్చయించుకొన్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ వ్రాశారు. వివరాల మేరకు, కర్ణాటక శివమొగ్గ జిల్లా కుగ్వే గ్రామానికి చెందిన శ్రీకాంత్ నాయక్, సుజాత దంపతులు లేఅవుట్లు వేశారు. ఖండిక గ్రామ పంచాయితీ పరిధిలోని తమ భూమిని ప్లాట్లుగా అభివృద్ధి చేశారు. ఇందుకోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. లేఅవుట్ క్లియరన్స్ పత్రం కొరకు స్థానికంగా 5లక్షలు, ఉన్నతస్థాయిలో 10లక్షల రూపాయలను లంచంగా డిమాండ్ చేశారు. సమస్య పై డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో ఆ దంపతులు చనిపోయేందుకు నిర్ణయించుకొన్నారు.

తమ డబ్బులన్నీ లేఅవుట్‌ కోసం పెట్టినట్లు తెలిపారు. దీంతో అధికారులకు లంచాలు ఇచ్చేందుకు తమ వద్ద చిల్లిగవ్వ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర పతికి లెటరు వ్రాశారు. తమ భూమిని ప్రభుత్వం తీసుకుని చనిపోయేందుకు అనుమతించాలంటూ ఆ లేఖలో కోరారు. మెర్సీ కిల్లింగ్‌ కొరకు అనుమతి కోసం రాష్ట్రపతి ముర్ముకు రాసిన లేఖను సాగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌కు అందజేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారి వారి సమస్యను పరిశీలిస్తామని తెలిపారు. ఇక భాజపా పాలనలో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని పదే పదే చెప్పుకొనే నేతలు దీనిపై స్పందించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Doctorate to music director Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు గౌరవ డాక్టరేట్…. ప్రదానం చేసిన పీఎం మోదీ

Exit mobile version