Naveen Patnaik: ఒడిషాలో నవీన్ పట్నాయక్ శకం ముగిసింది. గత 24 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఏకచత్రాధిపత్యం నడిపించిన బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ బుధవారం నాడు రాజీనామా పత్రాన్ని ఒడిషా గవర్నర్ రఘుబర్‌దాస్‌కు సమర్పించారు. కాగా రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో బీజేడీ ఘోర పరాజయం పొందడంతో రాజీనామా సమర్పించాల్సి వచ్చింది. ఇక నవీన్‌పట్నాయక్ విషయానికి వస్తే 1997 నుంచి బీజేడీ అధికారంలో ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి.. (Naveen Patnaik)
ఇక ఒడిషా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ 78 సాట్లు దక్కించుకోగా.. బీజేపీ విషయానికి వస్తే 51 సీట్లు దక్కించుకుంది. 147 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటి మార్కు 74ను బీజేపీ సాధించింది. కాంగ్రెస్ విషయానికి వస్తే 14 సీట్లు దక్కించుకుంది. ఇక లోకసభ విషయానికి వస్తే బీజేపీ మొత్తం 21 పార్లమెంటు స్థానాలకు గాను 20 స్థానాలు దక్కించుకోగా.. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానానికి పరిమితం మైంది. బీజేడీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోయింది.
తండ్రి చనిపోయాక రాజకీయాల్లోకి..
ఇక నవీన్ పట్నాయక్ విషయానికి వస్తే అకస్మాత్తుగా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ పేరుతో బీజేడిని స్థాపించారు. ఇక నవీన్ పట్నాయక్ రాజకీయ ప్రయాణం విషయానికి వస్తే 1998 లోకసభ ఉప ఎన్నికల్లో ఆయన తండ్రి నియోజకవర్గం అక్సా నుంచి పోటీ చేశారు. అటు తర్వాత 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఘన విజయం సాధించి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా పట్నాయక్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి అటు తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన మంగళవారం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. దేశంలో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో నవీన్ పట్నాయక్ రెండవ స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ ఆక్రమించారు.