Odisha CM Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును వెనక్కి నెట్టి ఆయన ఈ ఘనత సాధించారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఇప్పటికీ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉన్నది. ఆయన 1994 డిసెంబర్12 నుంచి 2019 మే 27 వరకు 24 ఏండ్లకుపైగా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నవీన్‌పట్నాయక్.. 2000 సంవత్సరం మార్చి 5న తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 23 ఏండ్ల 138 రోజులుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు 1977 జూన్21 నుంచి 2000 సంవత్సరం నవంబర్ 5 వరకు 23 ఏండ్ల 137 రోజులపాటు పదవిలో కొనసాగారు. చామ్లింగ్, జ్యోతిబసు తర్వాత వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రి అయిన మూడో నేత నవీన్ పట్నాయక్ కావడం విశేషం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ విజయం సాధించి పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి అయితే, అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు నవీన్ పట్నాయక్.