Prime9

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ మరోసారి భేటీ

NSA Doval Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ప్రధాని మోదీతో తొలిసారి భేటీ అయిన అజిత్ దోవల్.. సరిహద్దుల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిస్థితులపై చర్చిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిపిందే. మొత్తం 9 ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన దాడిలో 80 మంది ఉగ్రవాదులు మృతి చెందారు.

 

ఈ మేరకు 50 నిమిషాల పాటు మోదీ, దోవల్ చర్చలు జరిపారు. దోవల్ తర్వాత ప్రధానితో హోంశాఖ కార్యదర్శి గోవిండ్ మోహన్ భేటీ కానున్నారు. అంతర్గత భద్రతపై మోదీకి గోవింద్ మోహన్ బ్రీఫింగ్ చేయనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా సరిహద్దు భద్రత, ఎల్‌ఓసా పరిస్థితులపై సమాలోచనలు చేశారు.

 

ఇదిలా ఉండగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో దోవల్ భేటీ అవ్వగా.. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతున్నాయి. అలాగే ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అఖిలపక్షానికి కేంద్రం వివరించనుంది. ప్రభుత్వం తరపున సమావేశానికి రాజ్‌నాథ్, అమిత్ షా, నడ్డా హాజరుకానున్నారు. ఈ భేటికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు.

 

‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పరిణామాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ వివరించారు. దేశ అంతర్గత భద్రతపై ప్రతిపక్ష నేతలకు అమిత్ షా వివరన ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ చర్యలకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

 

 

Exit mobile version
Skip to toolbar