POCSO Act: పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయస్సును తగ్గించవద్దన్న లా కమిషన్

లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే పోక్సో (POCSO) చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయస్సును తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ లా కమిషన్ తన అభిప్రాయాలను తెలియజేసింది. లా కమిషన్ శుక్రవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో, సమ్మతి వయస్సును 16 ఏళ్లకు తగ్గించవద్దని సూచించింది.

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 08:36 PM IST

 POCSO Act: లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే పోక్సో (POCSO) చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయస్సును తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ లా కమిషన్ తన అభిప్రాయాలను తెలియజేసింది. లా కమిషన్ శుక్రవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో, సమ్మతి వయస్సును 16 ఏళ్లకు తగ్గించవద్దని సూచించింది. భారతదేశంలో ప్రస్తుత సమ్మతి వయస్సు 18 ఏళ్లుగా ఉంది.

పోక్సో చట్టం కాగితాలపైనే ఉంటుంది..( POCSO Act)

సమ్మతి వయస్సును 16 సంవత్సరాలకు తగ్గించడం వలన బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటంలో ప్రత్యక్ష మరియు ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. ఇది అనుకోని పరిణామాలక” దారి తీస్తుందని కమిషన్ పేర్కొంది. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారి మధ్య లైంగిక సంబంధాలను నేరరహితం చేయడం నిజమైన కేసులకు హాని కలిగిస్తుందని మరియు పోక్సో చట్టాన్ని కేవలం కాగితంపై చట్టంగా మారుస్తుందని పేర్కొంది.

రెండు పక్షాల నుండి నిశ్శబ్ద ఆమోదంతో కూడిన కేసులు సాధారణంగా చట్టం పరిధిలోకి వచ్చేంత తీవ్రతతో పరిగణించబడకుండా ఉండేలా కమిషన్ చట్టానికి సవరణలను సూచించింది. 16-18 సంవత్సరాల వయస్సు గల పిల్లల మధ్య నిశ్శబ్ద ఆమోదానికి సంబంధించిన కేసులలో శిక్ష విధించే విషయంలో గైడెడ్ జ్యుడీషియల్ విచక్షణను ప్రవేశపెట్టాలని సూచించింది.ఇది మైనర్‌ల మధ్య ఏకాభిప్రాయ శృంగార సంబంధాలతో వ్యవహరించడంలో చట్టం సమతుల్యంగా ఉందని నిర్ధారిస్తుంది, అదే సమయంలో లైంగిక దోపిడీ నుండి వారిని కాపాడుతుందని లా కమిషన్ తెలిపింది.