Site icon Prime9

Heat wave in North India: ఉత్తరాది రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు

heatwave

heatwave

Heat wave in North India: ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోని చురు, హర్యానాలోని సిర్సాలో పగటి ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతను మించిపోయాయి. సరాసరి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ దాటింది. భారత వాతావరణశాఖ అంచనా ప్రకారం ఇదే అత్యంత ఉష్ణోగ్రతలను తేల్చి చెప్పాయి. అయితే ఢిల్లీలో బుధవారం నాడు అత్యధిక ఉష్ణోగ్రత 52.9 డిగ్రీలు నమోదు అయినట్లు ప్రకటించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలు..సెన్సర్‌ల వల్ల తప్పుడు రీడింగ్‌ చూపించిందని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని మూడు వాతావరణ కేంద్రాల్లో టెంపరెచర్‌ రికార్డు చేశారు. గరిష్టంగా 49 డిగ్రీలని అధికారులు వివరించారు. ముంగేష్‌పురా, నరేలీలాలో అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

పదిచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు..(Heat wave in North India)

ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ పది వాతావరణ కేంద్రాల్లో ఈ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేశాయని చెప్పారు. వాటిలో ఆగ్రా, తాజ్‌ మహల్‌లో 48.6 డిగ్రీ లసెల్సియస్‌, బిహార్‌లోని డెహ్రీలో 47 డిగ్రీలు, ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో 48.2 డిగ్రీలు, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో 49 డిగ్రీలు, హర్యానాలోని నార్నావుల్‌లో 48.5 డిగ్రీలు, ఢిల్లీలోని ఆయానగర్‌లో 47.6 డిగ్రీలు, న్యూఢిల్లీ రిడ్జ్‌ ఏరియాలో 47.5 డిగ్రీల సెల్సియస్‌, మధ్యప్రదేశ్‌లోని రేవాలో 48.2 డిగ్రీలు, హర్యానాలోని రొహటక్‌లో 48.1 డిగ్రీల సెల్సియస్‌, వారణాసిలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని తెలిపారు.

అయితే రాజస్థాన్‌లో మాత్రం భానుడు కాస్తా కనికరించాడు. దక్షిణ రాజస్థాన్‌ జిల్లాలోని బర్మార్‌, జోథ్‌పూర్‌, ఉదయ్‌పూర్‌, సిరోహి, జాలోర్‌లలో ఈ నెల 28న నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. అరేబియా సముద్రం నుంచి తేమగాలి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్తా దిగివచ్చాయి. గురువారం నుంచి క్రమంగా ఉత్తరాదిన పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతం నుంచి కూడా బుధవారం నుంచి తేమగాలులు వీచడంతో ఉత్తరప్రదేశ్‌లో కూడా క్రమంగా ఎండలు తగ్గముఖం పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. కాగా గురువారం నాడు కూడా రాజస్థాన్‌, హర్యానా, చండీఘడ్‌, ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌,బిహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎండ తీవ్ర సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదైంది.

దీంతో పాటు విదర్భ, జమ్ము కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, చత్తీస్‌గఢ్‌లలో సాధారణం కంటే కాస్తా ఎక్కువగా ఎండలు కాశాయి. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 50.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయ్యింది. హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీలు, ముంగేష్‌పూర, నారేలాలో 49.9 డిగ్రీలు, నజాఫ్‌గడ్‌లో 49.8 డిగ్రీలు, సిర్సాలో 49.5 డిగ్రీలు, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో 49.9 డిగ్రీలు, పిలానీ, పిలోడి, ఝాన్సీలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరి కొన్ని రోజుల పాటు సాధారణం కంటే కాస్తా ఎక్కువగానే ఎండలు కాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

 

Exit mobile version