wrestlers speech: న్యూఢిల్లీలో నిరసన తెలిపిన రెజ్లర్లపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేయాలని అభ్యర్థనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు యాక్షన్ టేక్ రిపోర్ట్ (ఎటిఆర్)ని కోర్టుకు సమర్పించారు.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని, విద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారని పిటిషన్‌లో ఆరోపించారు.
అనుచిత నినాదాలు లేవు..( wrestlers speech)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదుదారు అందించిన వీడియో సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత, రెజ్లర్లు ఎటువంటి అనుచిత నినాదాలు చేయలేదని మరియు ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడలేదని నిర్ధారించారు.అందువల్ల ఈ దరఖాస్తును కొట్టివేయాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.తదుపరి వాదనలను జూలై 7న కోర్టు వాయిదా వేసిందిఅంతకుముందు, మే 25 న, ఫిర్యాదుపై ప్రతిస్పందనగా ఎటిఆర్ సమర్పించాలని కోర్టు పోలీసులను కోరింది.అటల్ జన్ పార్టీ’ జాతీయ చీఫ్ అని చెప్పుకునే బామ్ బామ్ మహారాజ్ నౌహతియా తరపున ఈ దరఖాస్తు దాఖలైంది.దరఖాస్తులో పేర్కొన్న రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా మరియు సాక్షి మాలిక్ పేర్లను పేర్కొన్నారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ బాధితురాలు రెండో వాంగ్మూలాన్ని ఎందుకు నమోదు చేసిందో దర్యాప్తు చేయాలని నిర్భయ తల్లి ఆశాదేవి డిమాండ్ చేశారు. రెండవ స్టేట్‌మెంట్‌లో లైంగిక వేధింపుల అభియోగం లేదని మైనర్ తండ్రి చెప్పిన విషయం తెలిసిదే.మైనర్ బాలిక తన స్టేట్‌మెంట్‌ను ఎందుకు మార్చింది, ఎవరైనా ఒత్తిడి చేశారా అనే దానిపై విచారణ జరగాలి” అని ఆశా దేవి అన్నారు.