Nirmala Sitharaman: ‘మధ్యతరగతి నుంచే వచ్చాను.. వారి కష్టాలు నాకు తెలుసు’.. బడ్జెట్ కు ముందు నిర్మలా సీతారామన్ కామెంట్స్

Nirmala Sitharaman: కేంద్ర వార్షిక బడ్జెట్ (2023-2024) సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతరామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్ఎస్ఎస్ కు చెందిన ‘పాంచజన్య’మ్యాగజైన్ నిర్వహించిన కార్యక్రంలో ఆమె పాల్గొన్నారు.

‘నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్య తరగతి పై కొత్తగా ఎలాంటి పన్నులు వేయలేదు. నేను మధ్యతరగతి నుంచే వచ్చాను.. వారి కష్టాలు నాకు తెలుసు. ఇక పై కూడా మోదీ ప్రభుత్వం మధ్య తరగతి వారి కోసమే పనిచేస్తుంది’అని నిర్మల వ్యాఖ్యానించారు. బడ్జెట్ కు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంపై అంతా చర్చ మొదలైంది.

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మధ్య తరగతికి తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో మద్యతరగతి గురించి నిర్మలా సీతారామన్ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.

మధ్య తరగతి కోసం మరింత

మోదీ ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ట్యాక్సులు వేయడం లేదని నిర్మలా అన్నారు. 27 నగరాల్లో మెట్రో రైలు నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తున్నామని.. 100 స్మార్ట్ సిటీలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కువ శాతం ఉన్న మధ్య తరగతి ప్రజల కోసం మోదీ గవర్నమెంట్ మరింత చేయబోతుందని.. 2020 బడ్జెట్ నుంచి ఏటా మూలధన వ్యయం పెంచుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు.

బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రక్షాళన కారణంగా మొండి బకాయిలు(ఎన్పీఏ) బాగా తగ్గాయని సీతారామన్(Nirmala Sitharaman) చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి మునపటి కంటే మెరుగైందన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఆయా బ్యాంకులన్నీ రూ. 31,820 కోట్ల నికర లాభాన్ని ప్రకటించాయని ఈ సందర్బంగా నిర్మలా ప్రస్తావించారు.

దాదాపు అన్నీ బ్యాంకులకు రూ. 2.11 లక్షల కోట్ల మూలధన సాయం అందించామని గుర్తుచేశారు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రెట్టింపు లాభాన్ని బ్యాంకులు పొందాయని తెలిపారు. బ్యాంకుల కోసం ప్రభుత్వం తీసుకున్న 4ఆర్( వ్యూహం ఫలితాలని ఇస్తోందన్నారు.

ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోండి

దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టినట్టు ఆమె వెల్లడించారు. ఉచిత హామీలు ప్రకటించే ముందు దేశంలో ఆర్థిక పరిస్థితినిదృష్టిలో పెట్టుకోవాలని.. అందులో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆమె పాకిస్థాన్ తో వాణిజ్యంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 లో జరిగిన పుల్వామ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ లో వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. భారత్ ను వ్యాపార అనుకూల దేశంగా పాకిస్థాన్ గుర్తించలేదని తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/