NIRF Rankings: మన దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాస్ టాప్ లో ఉండటం వరుసగా ఐదో సారి. అదే విధంగా ఉత్తమ యూనివర్పిటీల ర్యాంకింగ్స్ లో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి స్ఠానాన్ని కైవసం చేసుకుంది. విద్యాసంస్థల్లో అందిస్తోన్న విద్యాబోధన , అక్కడ కల్పస్తున్న సౌకర్యాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్ కింద ఈ ర్యాంకులను ఇస్తున్నారు.
ఓవరాల్ గా విద్యాసంస్థల లిస్ట్ లో ఐఐటీ మద్రాస్ తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో ఐఐఎస్సీ బెంగళూరు , మూడవ స్థానంలో ఐఐటీ ఢిల్లీ నిలిచాయి. యూనివర్సిటీల పరంగా మొదటి మూడు స్థానాల్లో ఐఐఎస్సీ బెంగళూరు, ఢిల్లీ లోని జేఎన్ యూ, జామియా మిలియా ఇస్లామియా లు ఉన్నాయి. హైదరాబాద్ హెచ్ సీయూ 10 వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ విభాగాల్లో ఐఐటీ మద్రాస్ వరుసగా తన టాప్ ప్లేస్ ను కొనసాగించింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్ లో ఐఐఎం అహ్మదాబాద్ తొలి స్థానం దక్కించుకుంది. ఓవరాల్ ర్యాంకింగ్స్ లో వరంగల్ ఎన్ఐటీ కి 45 స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 46 వ స్థానంలో రాగా.. యూనివర్సిటీల పరంగా ఓయూ కి 22 వ స్థానం దక్కింది.
ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోళికోడ్ లు తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తొలి స్థానంలో ఉంది. రెండు , మూడు స్థానాల్లో జామియా హమ్ దర్ద్, బిట్స్ పిలానీ నిలిచాయి. ఇక న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ, పుణె సింబయాసిస్ లా స్కూల్ లు మొదటి మూడు ర్యాంకులు సాధించాయి. నాల్గో స్థానంలో హైదరాబాద్ ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ నిలిచింది. ఉత్తమ పరిశోధన పరంగా ఐఐఎస్‌సీ బెంగళూరు , ఆవిష్కరణల పరంగా ఐఐటీ కాన్పూర్ మొదటి స్థానంలో దక్కించుకున్నాయి. వైద్య విద్య విభాగంలో మొదటి స్థానంలో న్యూఢిల్లీ ఎయిమ్స్ , రెండో స్థానంలో చండీగఢ్ PGIMER,వేలూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మూడో స్థానంలో ఉన్నాయి.