Site icon Prime9

NIA Raids: 6 రాష్ట్రాలు.. 51 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు.

NIA Raids

NIA Raids

 NIA Raids: భారత్‌ -కెనడాల మధ్య దౌత్య చిచ్చు పెట్టిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్‌ సానుభూతిపరులు-గ్యాంగ్‌స్టర్ల మధ్య ఉన్న బంధాన్ని వెలికితీసే పనిలోపడింది ఎన్‌ఐఏ. దీనిలో భాగంగా ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.

హవాలా మార్గంలో డబ్బు..( NIA Raids)

పంజాబ్‌, హరియాణా, దిల్లీ-ఎన్‌సీఆర్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో 51చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. భారత్‌లో నియమించుకొన్న వ్యక్తులకు ఇతర దేశాల్లోని ఖలిస్థానీలు-గ్యాంగ్‌స్టర్ల నుంచి హవాలా మార్గంలో డబ్బులు వస్తున్నాయని.. వీటిని ఉపయోగించి వారు డ్రగ్స్‌, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. వీరికి పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నుంచి సహకారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే యూఏపీఏ కింద అరెస్టు చేసిన వారి నుంచి ఈ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం పంజాబ్‌లో 30 చోట్ల, రాజస్థాన్‌లో 13, హరియాణాలో నాలుగు చోట్ల, ఉత్తరాఖండ్‌లో రెండు, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో చోట తనిఖీలు జరుగుతున్నాయి.

ఇప్పటికే భారత్‌ నుంచి పారిపోయి యూకే, కెనడా, దుబాయ్‌, పాకిస్థాన్‌ ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న 19 మంది ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల జాబితాను జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. దీంతోపాటు హర్విందర్‌ సింగ్‌ సంధు, లక్బిర్‌ సింగ్‌ సంధు పేరిట 10 లక్షలు చొప్పున రివార్డును కూడా ప్రకటించింది. వీరికి బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది.

Exit mobile version
Skip to toolbar