New laws: ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు..

మూక హత్యల కేసుల్లో ఉరిశిక్ష విధింపును కేంద్రం ప్రవేశపెడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పార్లమెంట్‌లో క్రిమినల్ చట్టాల సవరణను ప్రకటించారు. దీనికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష లేదా మరణశిక్ష విధించబడుతుందని చెప్పారు.

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 04:33 PM IST

New laws:మూక హత్యల కేసుల్లో ఉరిశిక్ష విధింపును కేంద్రం ప్రవేశపెడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పార్లమెంట్‌లో క్రిమినల్ చట్టాల సవరణను ప్రకటించారు. దీనికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష లేదా మరణశిక్ష విధించబడుతుందని చెప్పారు.

మూడు కొత్త బిల్లులు..(New laws)

ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను రద్దు చేసి, వీటి స్దానంలో కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు హోం మంత్రి అమిత్ షా చెప్పారు.ఈ రోజు నేను ముందుకు తెస్తున్న మూడు బిల్లుల్లో నేర న్యాయ వ్యవస్థ సూత్రప్రాయ చట్టం ఉంది. ఒకటి 1860లో ఏర్పాటైన ఇండియన్ పీనల్ కోడ్, రెండోది 1898లో ఏర్పాటైన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, మూడోది ఇండియన్ 1872లో ఏర్పాటైన ఎవిడెన్స్ యాక్ట్.. బ్రిటీష్ వారు తీసుకొచ్చిన ఈ చట్టాలను నేటితో అంతం చేస్తాం అని అన్నారు.

దేశద్రోహ చట్టం రద్దు ..

దేశద్రోహ చట్టం రద్దు చేయబడిందని అమిత్ షా ప్రకటించారు. ప్రతిపాదిత చట్టంలో దేశద్రోహం అనే పదం లేదు. భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత మరియు సమగ్రతకు హాని కలిగించే చర్యల కోసం సెక్షన్ 150 ఉందన్నారు.దేశద్రోహ నేరానికి సంబంధించిన శిక్షల్లో మార్పులు చేస్తున్నట్టు అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుత చట్టం ప్రకారం, దేశద్రోహానికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా మూడు సంవత్సరాల వరకు పొడిగించే జైలు శిక్ష విధించబడుతుంది. కొత్త బిల్లు ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్షగా మార్చాలని ప్రతిపాదించింది.