Site icon Prime9

NEET UG: రేపే నీట్‌ పరీక్ష.. అభ్యర్ధులు ఈ విషయాలను మర్చిపోవద్దు

neet

neet

NEET UG: నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపు ఈ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షను.. 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. దేశం మెుత్తంగా సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్ధులు హాజరుకానున్నారు.

అభ్యర్థులు ఇవి మరవొద్దు (NEET UG)

నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపు ఈ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షను.. 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. దేశం మెుత్తంగా సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్ధులు హాజరుకానున్నారు.

మరి ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు మాత్రం నిబంధనలు మరిపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం.

> పరీక్షకు తప్పనిసరిగా అడ్మిట్ కార్డుతో పాటు.. ఏదైనా ఓ గుర్తింపు కార్డుని కచ్చితంగా తీసుకువెళ్లాలి. దీంతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను క్యారీ చేయాలి.

> అభ్యర్థులు డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోనికి అనుమతించరు.

> షూస్, ఎక్కువ ఎత్తున్న శాండిల్స్ వేసుకోకూడదు. తక్కువ ఎత్తున్న వాటిని మాత్రమే ఉపయోగించాలి.

> పేపర్లు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్సులు, ప్లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్స్‌, ఎలక్ట్రానిక్‌ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుమతించరు.

>చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి కూడా ధరించకూడదు.

>మొబైల్‌ ఫోన్లు, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లు, పేజర్స్‌, హెల్త్‌ బ్యాండ్స్‌, స్మార్ట్‌ వాచ్‌లు వంటి కమ్యూనికేషన్‌ డివైజ్‌లను లోనికి అనుమతించరు. ఎలక్ట్రానిక్‌ వస్తువులను కూడా తీసుకెళ్లకూడదు.

> అభ్యర్థులు పరీక్ష రాసేందుకు బాల్‌ పాయింట్‌ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు.

 

Exit mobile version