Site icon Prime9

Maratha Quota Protesters: ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టిన మరాఠా కోటా నిరసనకారులు

Maratha quota protesters

Maratha quota protesters

Maratha Quota Protesters: నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సిపి) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, తగులబెట్టారు. రాళ్లు విసిరి నివాసం వద్ద పార్క్ చేసిన కారును కూడా తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్ అతని బంగ్లాలో భారీ మంటలు, దాని నుండి పొగ చుట్టుపక్కల చుట్టూ వ్యాపించడం కనిపించాయి.

మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ నిరాహారదీక్షపై మరాఠా కోటా ఉద్యమం గురించి మాట్లాడిన సోలంకే ఆడియో క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.ఆడియో క్లిప్‌లో, ఎమ్మెల్యే మరాఠా రిజర్వేషన్ అంశాన్ని పిల్లల ఆట గా పేర్కొన్నారు. .గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి నేడు కీలక వ్యక్తిగా మారాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని సోలంకే చెప్పారు. అదృష్టవశాత్తూ, నా కుటుంబ సభ్యులు లేదా సిబ్బంది ఎవరూ గాయపడలేదు. మేమంతా క్షేమంగా ఉన్నాము, కానీ అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

శివసేన ఎంపీ రాజీనామా..(Maratha Quota Protesters:)

మహారాష్ట్రలో ఉద్యోగాలు మరియు విద్యలో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాదలని కోరుతూ జరిగిన ఆందోళనలు ఇటీవల వార్తల్లో కెక్కాయి. రిజర్వేషన్ అంశంపై శివసేన నాయకుడు హేమంత్ పాటిల్ హింగోలి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. యవత్మాల్‌లోని నిరసన వేదిక వద్ద ఆయన తన రాజీనామా లేఖ రాశారు.ఎంపీ రాజీనామాపై స్పందిస్తూ, అక్టోబర్ 25 నుండి నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే పాటిల్, ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా రాష్ట్రంలోని మరాఠా ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలని సూచించారు.మరాఠాలు అభివృద్ధి చెందకుండా ఆపడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి చేసిన కుట్ర అంటూ రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో జాప్యంపై ఆయన వ్యాఖ్యానించారు.మరాఠా కోటా సమస్య బీడ్ జిల్లాలో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తాజాగా అక్టోబర్ 28న ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరియు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరాఠా సమాజానికి తమ మద్దతును పునరుద్ఘాటించారు, రాష్ట్ర ప్రభుత్వం వారి హక్కులను వారికి కల్పిస్తుందని వారికి హామీ ఇచ్చారు. సోమవారం, ఫడ్నవీస్ మాట్లాడుతూ, మరాఠాలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో శాశ్వత నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరాఠా రిజర్వేషన్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రతిపాదిత క్యూరేటివ్ పిటిషన్‌ను సమర్పించడంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి ముగ్గురు సభ్యుల నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు షిండే సోమవారం తెలిపారు.

Exit mobile version