Navjot Singh Sidhu: కాంగ్రెస్ నాయకుడిగా మారిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రస్తుతం పాటియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే జైలుకు వెళ్లాక సిద్దూ 34 కిలోల బరువు తగ్గాడని తెలుస్తోంది. సిద్ధూ సహాయకుడు మరియు మాజీ ఎమ్మెల్యే నవతేజ్ సింగ్ చీమా ఈ విషయాన్ని చెప్పాడు,ఫిట్‌నెస్ కోసం సిద్దూ యోగా, ధ్యానం మరియు కఠినమైన ఆహారం అనే మూడింటిని అవలంబించాడని అతను తెలిపాడు. 6 అడుగుల 2 అంగుళాల పొడవున్న సిద్దూ బరువు ఇప్పుడు 99 కేజీలు.
జైలులో సిద్ధూ నాలుగు గంటల పాటు ధ్యానం , రెండు గంటలు యోగా మరియు వ్యాయామాలు, రెండు నుండి నాలుగు గంటలు చదదుతున్నాడని కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నాడని అన్నాడు. సిద్దూసాహిబ్ శిక్ష ముగించుకుని బయటకు వచ్చినప్పుడు, మీరు అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. అతను క్రికెటర్‌గా ఉన్న సమయంలో అతను ఎలా కనిపిస్తాడో అలాగే ఉన్నాడు. అతను 34 కిలోలు తగ్గాడు మరియు అతను మరింత తగ్గుతాడు. ప్రస్తుతం అతని బరువు 99 కిలోలు. . అతను ధ్యానంలో ఎక్కువ సమయం గడుపుతున్నందున అతను ప్రశాంతంగా ఉన్నాడు అని శుక్రవారం 45 నిమిషాల పాటు పాటియాలా జైలులో సిద్ధూను కలిసిన చీమా పేర్కొన్నాడు.
కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మే 20న పాటియాలాలోని కోర్టులో లొంగిపోయి సెంట్రల్ జైలులో ఒక సంవత్సరం శిక్షను అనుభవిస్తున్నాడు. 1988లో, పాటియాలాకు చెందిన గుర్నామ్ సింగ్ పై దాడిచేసి అతని మరణానికి కారణమయినట్లు సిద్దూపై ఆరోపణలు వచ్చాయి.