Site icon Prime9

నాసల్ వ్యాక్సిన్: బూస్టర్ డోస్ గా నాసల్ వ్యాక్సిన్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకోవాలంటే..?

nasal

nasal

Nasal vaccine: కోవిడ్ -19 నివారణకు నాసల్ వ్యాక్సిన్ వాడకాన్ని ఆమోదించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు తీసుకున్న వారు దీనిని ‘హెటిరోలాగస్‌ బూస్టర్‌’గా తీసుకోవచ్చని సూచించింది. అయితే ప్రస్తుతం ఇది ప్రైవేట్ ఆసుపత్రులలో అందుబాటులో ఉంటుందని, 18 ఏళ్ల దాటిన వారు దీనిని ఉపయోగించుకోవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ ‘ఇన్‌కొవాక్‌’ను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నవంబర్‌లో అత్యవసర అనుమతి ఇవ్వగా.. కేంద్రం దీనికి ఇప్పుడు ఆమోదం తెలిపింది. దేశంలో మళ్ళీ కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలంటే..

కో-విన్‌ వేదికగా ఇన్‌కోవాక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ను పొందే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుతానికి ఈ నాసల్‌ వ్యాక్తిన్‌ ప్రైవేటు వైద్య కేంద్రాల్లో మాత్రమే లభ్యమవుతుంది. భారత్ బయోటెక్ యొక్క ఇన్ కోవాక్ రెండు-డోస్ షెడ్యూల్‌ను కలిగి ఉంటుంది. మొదటి మోతాదులో మొత్తం 4 చుక్కలు ఉంటాయి (ప్రతి నాసికా రంధ్రంలో 2). రెండవ మోతాదు 28 రోజులలోపు రిపీట్ అవుతుంది. ఈ రెండవ మోతాదులో మొత్తం 4 చుక్కలు (ప్రతి నాసికా రంధ్రంలో 2) ఉంటాయి. నాసికా వ్యాక్సిన్ల విషయంలో, వైరస్ ప్రవేశించే ప్రదేశంలో దాడి చేయడం ద్వారా శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు

సైడ్ ఎఫెక్ట్ తక్కువే..

వ్యాక్సిన్‌లకు సిరంజిలు మరియు సూదులు అవసరం లేనందున వాటి నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. నాసికా టీకాలు శిక్షణ పొందిన వ్యక్తులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. వీటిని సులభంగా తీసుకోవచ్చు. మామూలు టీకాలతో పోల్చితే సైడ్ ఎఫెక్ట్స్ ( తలనొప్పి, జ్వరం) చాలా తక్కువగా ఉంటాయి.

Exit mobile version