Narendra Modi 3.0 Cabinet: కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. ఆదివారం నాడు ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా మోదీ మొట్టమొదటి కేబినెట్ సమావేశం సోమవారం సాయంత్రం ఆయన స్వగృహంలో జరిగింది. ఇక మొదటి సమావేశంలోనే కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇళ్లు నిర్మించాలని తీర్మానం చేసింది. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద కేంద్రప్రభుత్వం సాయంతో ఇటు గ్రామీణ ప్రాంతాలతో పాటు అటు పట్టణ ప్రాంతాల్లో గృహాలు నిర్మించడానికి ఆర్థిక సాయం అందిస్తుంది. కాగా మొదటి కేబినెట్ సమావేశం న్యూఢిల్లీలోని 7 లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతోంది.
2015 నుంచి ప్రారంభం..(Narendra Modi 3.0 Cabinet)
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో సమావేశం కొనసాగుతున్నా.. ఇప్పటి వరకు కొత్త మంత్రులకు పోర్టు ఫోలియోలు మాత్రం కేటాయించలేదు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో అర్హులైన కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా కేంద్రంలో మోదీ సర్కార్ 2015-16లో ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇటు గ్రామీణ ప్రాంతాలతో పాటు అటు పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. గత పది సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా సుమారు4.21 కోట్ల మంది పేదలు పీఎంఏవై స్కీం కింద ఇళ్లు నిర్మించుకున్నారు.
ప్రధానమంత్రి అవాస్ యోజన కింద నిర్మించే ఇళ్ల విషయానికి వస్తే కనీస వసతులు ఉండేలా నిర్మించి ఇచ్చారు. వాటిలో ప్రధానంగా ప్రతి ఇంటికి టాయిలెట్, ఎల్‌పీజీ కనెక్షన్, ఎలక్ర్టిటి సిటీ కనెక్షన్, నల్లా నీటి వసతి ఉండేలా చూసింది ప్రభుత్వం.కాగా ప్రధాని మూడో టర్మ్‌లో ఎంటర్ అయినందున మరో మూడు కోట్ల ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రప్రభుత్వం ఉంది.