Site icon Prime9

Nagaland cabinet: నాగాలాండ్ క్యాబినెట్లో తొలి మహిళా మంత్రి

Salhoutonou Kruse

Salhoutonou Kruse

Nagaland cabinet: ఇటీవల జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 56 ఏళ్ల సల్హౌటోనౌ క్రూసే చరిత్ర సృష్టించారు.60 ఏళ్ల రాష్ట్రావతరణలో నాగాలాండ్‌లో శాసనసభ్యురాలిగా మారిన మొదటి ఇద్దరు మహిళల్లో ఆమె ఒకరు.మంగళవారం, రాష్ట్ర మొట్టమొదటి మహిళా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేసి ఆమె మరో రికార్డు సృష్టించారు.

ఏడు ఓట్ల మెజారిటీతో గెలిచిన సల్హౌటోనౌ క్రూసే ..(Nagaland cabinet)

నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP)కి చెందిన క్రూసే పశ్చిమ అంగామి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి కెనీజాఖో నఖ్రోపై ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన మరో మహిళా అభ్యర్థి హెకానీ జఖాలు. ఆమె కూడా NDPP నుండి గెలిచింది. ఆమె దిమాపూర్-III నుండి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) యొక్క అజెటో జిమోమీపై 1,500 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు.మంగళవారం రాష్ట్ర తొలి మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం క్రూస్ మాట్లాడుతూ నేను దేవునికి ధన్యవాదాలు. తెలుపుతున్నాను.నేను సంతోషంగా ఉన్నాను . నేను మా ప్రజలకు చాలా చేయగలనని ఆశిస్తున్నాను.నాగా సమాజంలోని బాలికలు ధైర్యంగా ఉండండి, కష్టపడి పని చేయండి మరియు మీ కలలను చేరుకోండని క్రూసే చెప్పింది.

వారిద్దరూ సమర్దులైన మహిళలు..

క్రూస్ మరియు జఖాలు ఇద్దరూ “చాలా సమర్థులైన మహిళలు” అని ముఖ్యమంత్రి నైఫియు రియో అన్నారు. “మహిళా సాధికారత మరియు లింగ సమానత్వం మా ఎజెండాలో చాలా ఉన్నాయి” అని రియో చెప్పారు.1986లో కొహిమా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన క్రూస్, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు . రాష్ట్రంలోని చుమౌకెడిమా జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలను నిర్వహిస్తోంది. ఆమె భర్త, దివంగత కెవిశేఖో క్రూస్, 2018 ఎన్నికలలో అదే స్థానం నుండి ఓడిపోయారు. క్రూస్ రెండు దశాబ్దాలుగా అనేక పౌర సమాజ సంస్థల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఆమె అంగామి తెగల మహిళా సంఘానికి నాయకత్వం వహించారు.

1963లో నాగాలాండ్‌కు రాష్ట్ర హోదా లభించినప్పటి నుంచి 60 మంది సభ్యుల అసెంబ్లీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. మహిళలు ఎన్నికల్లో పోటీ చేసినా వారు విజయం సాధించలేదు. . ఈ ఏడాది ఎన్నికల్లో నలుగురు మహిళా అభ్యర్దులు పోటీ చేసారు. 1977లో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ టిక్కెట్‌పై రానో మీసే షాజియా నాగాలాండ్ నుంచి లోక్‌సభ కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత, నాగాలాండ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎస్ ఫాంగ్నాన్ కొన్యాక్‌ను బిజెపి నామినేట్ చేయడంతో ఈశాన్య రాష్ట్రం నుండి రెండవ మహిళ పార్లమెంటులోకి ప్రవేశించింది.నాగాలాండ్‌లో లోక్‌సభ మరియు రాజ్యసభలో ఒక్కో సీటు ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar