Site icon Prime9

BJP MLA: ముస్లింలు లక్ష్మిని పూజించరు.. వారు ధనవంతులు కాదా? బీహార్ బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్

BJP MLA

BJP MLA

BJP MLA: బీహార్‌లోని బిజెపి ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ హిందువుల విశ్వాసాలు, హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు ముస్లింలు లక్ష్మీదేవిని పూజించరని అయినా వారిలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారని అన్నారు.సరస్వతి విద్యా దేవత, కానీ ముస్లింలు ఆమెను పూజించరు. వారు పండితులు కాదా? అదేవిధంగా, వారు సంపద మరియు డబ్బు్ె దేవత అయిన మా లక్ష్మిని పూజించరు, వారు ధనవంతులు కాదా? అని పాశ్వాన్ ప్రశ్నించారు.హనుమాన్ జీ శక్తి దేవుడని, అయితే ఆయనను అమెరికాలో పూజించరు, ఇప్పటికీ ప్రపంచంలోనే అది సూపర్ పవర్” పాశ్వాన్ అన్నారు.

ఆత్మ మరియు పరమాత్మ అనే భావన కేవలం ప్రజల విశ్వాసమని బిజెపి నాయకుడు అన్నారు.అంతా మత విశ్వాసానికి సంబంధించినది. మీరు నమ్మితే అది దేవత, కాకపోతే అది కేవలం రాతి విగ్రహం మాత్రమే అని ఆయన అన్నారు.మనం దేవుళ్లను, దేవతలను నమ్మాలా వద్దా అనేది మన ఇష్టం. తార్కిక ముగింపును చేరుకోవడానికి మనం శాస్త్రీయ ప్రాతిపదికన ఆలోచించాలి. మీరు నమ్మడం మానేస్తే, మీ మేధో సామర్థ్యం పెరుగుతుందని పాశ్వాన్ అన్నారు.

బజరంగబలి శక్తి కలిగిన దేవుడు అని మరియు బలాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. ముస్లింలు లేదా క్రైస్తవులు బజరంగబలిని పూజించరు. వారు శక్తివంతులు కాదా? మీరు నమ్మడం మానేసిన రోజు ఇవన్నీ ముగిసిపోతాయి అని పాశ్వాన్ అన్నారు.పాశ్వాన్ వ్యాఖ్యలపై భాగల్‌పూర్‌లోని షెర్మారీ బజార్‌లో ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి, ఆయన దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.

Exit mobile version