MP Prajwal Revanna: ఎంపీ ప్రజ్వల్‌ రేవన్న అరెస్ట్‌కు రంగం సిద్ధం

కర్ణాటక హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవన్న ఈ నెల 31న అంటే శుక్రవారం జర్మనీ నుంచి బెంగళూరు చేరుకోనున్నారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే శుక్రవారం నాడు ఆయన బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనను అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర్‌ బుధవారం నాడు చెప్పారు.

  • Written By:
  • Publish Date - May 30, 2024 / 06:50 PM IST

MP Prajwal Revanna: కర్ణాటక హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవన్న ఈ నెల 31న అంటే శుక్రవారం జర్మనీ నుంచి బెంగళూరు చేరుకోనున్నారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే శుక్రవారం నాడు ఆయన బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనను అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర్‌ బుధవారం నాడు చెప్పారు. అధికార వర్గాల సమచారం ప్రకారం 33 ఏళ్ల ప్రజ్వల్‌ మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ మనవడు. కాగా ఆయన జర్మనీలోని మ్యూనిచ్‌ నుంచి బెంగళూరుకు గురువారం రాత్రి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఇక ప్రజ్వల్‌ విషయానికి వస్తే ఆయన గత నెల 26న కర్ణాటకలో లోకసభ ఎన్నికల పోలింగ్‌ జరిగిన మరుసటి రోజు తన డొప్లొమాటిక్‌ పాస్‌పోర్టుతో జర్మనీ పారిపోయాడు. అంతకు ముందు ఆయన పలువురు మహిళలతో శృంగారంలో పాల్గొన్న పెన్‌ డ్రైవ్‌లు హసన్‌ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో విచ్చలవిడిగా లభ్యమయ్యాయి. పార్టీలో పనిచేసే మహిళా కార్యకర్తల నుంచి ఆయన దగ్గర పనిచేసే మహిళా ఉద్యోగుల నుంచి ఇంట్లో పనిచేసే పనిమనిషుల వరకు పనికోసం వచ్చిన మహిళలపై అత్యాచారం చేసి వాటిని తన మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీసి భద్రపరిచాడు. ఈ వీడియోలను చూపించి బెదిరించి వారిపై పలుమార్లు అత్యాచారాలు చేశాడు హసన్‌ ఎంపీ.

సిట్ ముందు హాజరవుతానన్న రేవన్న.. (MP Prajwal Revanna)

ఇదిలా ఉండగా ప్రజ్వల్‌ గత సోమవారం నాడు ఒక వీడియో మేసేజ్‌ విడుదల చేసి ఈ నెల 31న సిట్‌ ముందు హాజరవుతానని ప్రకటించారు. అయితే హోంమంత్రి మాత్రం ఆయనపై కోర్టు వారెంట్‌ ఉంది.సిట్‌ అధికారులు ఆయనను బెంగళూరులో దిగిన వెంటనే అరెస్టు చేస్తారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ప్రజ్వల్‌ అడ్వకేట్‌ స్పెషల్‌ కోర్టులో మూడు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశారు. తన క్లయింట్‌ ప్రజా ప్రతినిధి అని పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే స్పెషల్‌ జడ్జి గజానన్‌ భట్‌ పిటిషన్‌ను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఇక ప్రజ్వల్‌ ముందస్తు బెయిల్‌ విషయానికి వస్తే హోలేనరసిపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఆయనపై అత్యాచారం కేసులతో పాటు పలు కేసులను సిట్‌లో కూడా ఫైల్‌ చేశారు. కాగా ప్రజ్వల్‌ తల్లి భవాని రేవన్న కూడా మందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టులో వేశారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు రానుంది. కాగా భవాని భర్త హెచ్‌డీ రేవన్న ఓ మహిళ కిడ్నాప్‌కు కుట్ర పన్నారన్న ఆరోపణపై మైసూరులోని కెఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఆమె తనన అరెస్టు చేస్తారన్న ఆలోచనతో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.