Site icon Prime9

Monsoon: ఈ ఏడాది కేరళలో 4 రోజులు ఆలస్యం కానున్న రుతుపవనాలు

Monsoon

Monsoon

Monsoon: ఈ ఏడాది కేరళలో రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యం కావచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. సాధారణంగా కేరళ రాష్ట్రంలో జూన్ 1 నుంచి రుతుపవనాలు ప్రారంభమవుతాయి.అయితే ఈ ఏడాది జూన్ 4 నుంచి రుతుపవనాలు ప్రారంభం కానున్నాయి.

2015 మినహాయిస్తే.. (Monsoon)

భారత వాతావరణ శాఖ (ఐఎండి) గత 18 సంవత్సరాలలో (2005-2022) కేరళలో రుతుపవనాల ప్రారంభ తేదీకి సంబంధించిన కార్యాచరణ అంచనాలు 2015లో తప్ప సరైనవనని నిరూపించబడ్డాయని తెలిపింది. రుతుపవనాల ప్రారంభం కేరళలో వేసవికాలం ముగింపుకు దారి తీస్తుంది. రుతుపవనాలు 2022లో మే 29న, 2021లో జూన్ 3న మరియు 2020లో జూన్ 1న కేరళ రాష్ట్రానికి వచ్చాయి.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో రుతుపవనాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఐఎండి ప్రకటించలేదు. ఈ సంవత్సరం , పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, లడఖ్ మరియు ఉత్తరాఖండ్ వంటి ప్రదేశాలలో ఇప్పటివరకు 18 శాతం అధిక వర్షపాతం నమోదైంది.ఈ కాలంలో ద్వీపకల్ప ప్రాంతంలో 88 శాతం అధిక వర్షపాతం (54.2 మిమీ సాధారణం కంటే 102 మిమీ) కురిసింది. అయితే, తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో మార్చి 1 నుండి మే 3 వరకు 29 శాతం వర్షపాతం నమోదయింది.

Exit mobile version
Skip to toolbar