Site icon Prime9

 MPPTCL : మధ్యప్రదేశ్ లో డ్రోన్లతో విద్యుత్ టవర్ల పర్యవేక్షణ

Drones

Drones

MPPTCL : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 10,000 హై వోల్టేజీ టవర్లను పర్యవక్షించేందుకు రాష్ట్రానికి చెందిన మధ్యప్రదేశ్ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ (MPPTCL) అక్టోబర్ 1 నుంచి డ్రోన్‌లను మోహరించబోతోందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు.సాఫీగా విద్యుత్ సరఫరా కోసంటవర్లను తనిఖీ చేయడానికి డ్రోన్‌లను ఉపయోగించడం దేశంలో ఇదే తొలిసారి అని MPPTCL మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ తివారీ పేర్కొన్నారు.

డ్రోన్లు టవర్ల వీడియోలు, దగ్గరి చిత్రాలను తీస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం టవర్ల తనిఖీ మాన్యువల్‌గా జరుగుతోంది. పరికరాలు తనిఖీ చేయడానికి ఉద్యోగులు టవర్లను ఎక్కుతారు మరియు ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది మరియు శ్రమతో కూడుకున్నది. ఇప్పుడు, డ్రోన్లు ఈ పనిని చేస్తాయని ఆయన చెప్పారు.డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, టవర్‌లపై అమర్చిన పరికరాల ఫోటోగ్రాఫ్‌లు మరియు వీడియోలను అన్ని వైపుల నుండి దగ్గరగా తీసుకోవచ్చని తెలిపారు. కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా తనిఖీలకు డ్రోన్‌లను వినియోగించడం ప్రోత్సాహకర ఫలితాలు రావడంతో వాటిని మోహరించాలని నిర్ణయించుకున్నట్లు తివారీ తెలిపారు.

వచ్చే నెల నుండి మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన 80,000 అదనపు హైవోల్టేజీ పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్ టవర్లలో 10,000 తనిఖీలకు డ్రోన్‌లను ఉపయోగించబోతున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో 10,000 టవర్లు తీసుకుంటున్నాం. మిగిలిన 70,000 టవర్ల డ్రోన్ పర్యవేక్షణ తర్వాత చేపడతామని, నిర్వహణ పనుల కింద ఎప్పటికప్పుడు టవర్ల పరిశీలన జరుగుతుందని తివారీ వివరించారు.

Exit mobile version