Delhi University: ప్రఖ్యాత ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ ‘సారే జహాన్ సే అచ్ఛా’ను రచించడం ద్వారా దేశానికి సేవ చేశాడని, అయితే తాను దానిని అసలు నమ్మలేదని ఢిల్లీ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ యోగేష్ సింగ్ అన్నారు. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో అల్లామా ఇక్బాల్‌పై ఉన్న అధ్యాయాన్ని తొలగించడంతోపాటు భారత విప్లవకారుడు వీర్ సావర్కర్‌పై అధ్యాయాన్ని చేర్చడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సిలబస్ లో ఎందుకు బోధిస్తున్నామో తెలియదు..( Delhi University)
ఢిల్లీ యూనివర్శిటీ 1014వ అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుపై చర్చ సందర్భంగా పాక్ జాతీయ కవి అల్లామా ఇక్బాల్ అలియాస్ ముహమ్మద్ ఇక్బాల్‌ను పొలిటికల్ సైన్స్ సిలబస్ నుండి తొలగించిన తర్వాత వివాదం చెలరేగింది.గత 75 సంవత్సరాలుగా మేము మహమ్మద్ ఇక్బాల్ గురించి సిలబస్‌లో ఎందుకు బోధిస్తున్నామో నాకు తెలియదు. అతను ప్రముఖ పాట ‘సారే జహాన్ సే అచ్చాను కంపోజ్ చేయడం ద్వారా భారతదేశానికి సేవ చేశాడని నేను అంగీకరిస్తున్నాను కానీ దానిని ఎప్పుడూ నమ్మలేదని యోగేష్ సింగ్ అన్నారు.
మన జాతీయనాయకుల గురించి చెప్పాలి..
అంతకుముందు శుక్రవారం అకడమిక్ కౌన్సిల్ సమావేశానికి వైస్ ఛాన్సలర్ సింగ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పునాది వేసిన వారిని యూనివర్సిటీ సిలబస్‌లో చేర్చరాదని అన్నారు.ఇక్బాల్ ‘ముస్లిం లీగ్’ మరియు ‘పాకిస్తాన్ ఉద్యమం’కు మద్దతుగా పాటలు రాశాడు. భారతదేశ విభజన మరియు పాకిస్తాన్ స్థాపన ఆలోచనను మొదట లేవనెత్తిన వ్యక్తి. అలాంటి వారి గురించి మన విద్యార్థులకు బోధించే బదులు, మన జాతీయ నాయకుల పాఠాలు చెప్పాలని ఆయన అన్నారు. యోగేష్ సింగ్ ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
సమావేశంలో, అండర్ గ్రాడ్యుయేట్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ (యుజిసిఎఫ్) 2022 కింద వివిధ కోర్సుల నాల్గవ, ఐదవ మరియు ఆరవ సెమిస్టర్‌ల సిలబస్ ఆమోదించబడింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిలాసఫీ ప్రతిపాదించిన బిఎ కోర్సుకు సంబంధించి స్టాండింగ్ కమిటీ సిఫార్సులను కూడా సమావేశంలో పరిశీలించి విభాగాధిపతితో కలిసి ఏకగ్రీవంగా ఆమోదించారు.