Modi’s New Cabinet: ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం నాడు మూడవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. తన మంత్రివర్గంలో పనిచేసిన 37 మంది మంత్రులను ఆయన ఈసారి తప్పించారు. కాగా గతంలో మంత్రులుగా చలామణి అయిన 18 మంది ఓడిపోయారు. మోదీ మూడవ టర్మ్‌లో ప్రముఖులైన ఏడుగురు కేబినెట్ ర్యాంకు మంత్రులు స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ రాణే, పురుషోత్తమ్ రూపాలా, అర్జున్ ముండా, ఆర్‌కె సింగ్, మహేంద్ర నాథ్ పాండేలను పక్కనపెట్టారు.
పదవులు దక్కని వారు..(Modi’s New Cabinet)
మోదీ రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు 2019లో వీరిని కేబినెట్ మంత్రులుగా తీసుకున్నారు. కాగా ఆదివారం జరిగిన ప్రధాని ప్రమాణ స్వీకారంలో వీరిని పక్కన పెట్టారు. అయితే వారిలో ముగ్గురు మంత్రులు ఇండిపెండెంట్ చార్జీ కలిగిన వారిని తిరిగి తీసుకున్నారు. మొత్తం 42 సహాయమంత్రుల్లో 30 మందిని మోదీ తప్పించారు.మంత్రివర్గంలో స్థానం దక్కనివారి విషయానికి వస్తే వికె సింగ్, ఫగ్గన్‌సింగ్ కులాస్థే, అశ్విని చౌబే, దాన్వే రావ్‌సాహెబ్ దాదారావు, సాధ్వీనిరంజన్ జ్యోతి, సంజీవ్ బాల్‌యాన్, రాజీవ్ చంద్రశేఖర్, సుభాష్ సర్కార్, నిషిత్ ప్రమాణిక్, రాజ్‌కుమార్ రంజన్ సింగ్, ప్రతిమా బౌమిక్, మీనాక్షి లేఖి, ముంజాపారా మహేంద్రబాయ్, అజయ్‌కుమార్ మిశ్రా, కైలాష్ చౌదరి, కపిల్ మోరేశ్వర్ పాటిల్, భారతి ప్రవీణ్ పవార్, కుషాల్ కిశోర్, భాగవంత్ కుబా, వి మురళీధరన్‌లకు నిరాశే మిగిలింది మోదీ సర్కార్‌లో వీరికి మంత్రిపదవులు మాత్రం దక్కలేదు.
అయితే మోదీ కేబినెట్ మొత్తాన్ని ప్రక్షాళన చేశారు. నడ్డాను కేబినెట్‌లో తీసుకున్నారు. అలాగే భాను ప్రతాప్‌సింగ్ వర్మ, జాన్ బర్లా, బిశ్వేశ్వర టుడు, భాగవంత్ కిశోర్‌రావ్ కారాడ్, దేవ్‌సిన్హ చౌహాన్, అజయ్ భట్, ఏ నారాయణస్వామి, సోమ్ ప్రకాశ్, రామేశ్వర్‌తేలి, దర్శనా విక్రమ్ జార్డోష్‌లను కొత్త మంత్రులుగా మోదీ తన కేబినెట్‌లో తీసుకున్నారు. కాగా 18 మంది మంత్రులు ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఎల్ మురుగన్ ఒక్కరే ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనకు తిరిగి మంత్రి పదవి కట్టబెట్టారు. కాగా ఆయన రాజ్యసభ సభ్యుడు.
అమెధీలో ఓడిపోయిన స్మృతి ఇరానీ
ఇక స్మృతి ఇరానీ విషయానికి వస్తే మోదీ రెండు టర్మ్‌లలో ఆమె కేబినెట్ మంత్రిగా సేవలందించారు. అమెధీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ను ఓడించారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె రాహుల్ సన్నిహితుడు కిశోరీ లాల్ శర్మ చేతిలో సుమారు 1.69 లక్షల ఓట్లతో ఓడిపోయారు. ఇక అనురాగ్ ఠాకూర్ విషయానిక వస్తే ఆయన వరుసగా ఐదుసార్లు హమీర్‌పూర్ లోకసభ నుంచి విజయం సాధించారు. మోదీ 2.0లో ఆయన రెండు మంత్రిత్వశాఖలు నిర్వహించారు. ఒకటి సమాచార ప్రసారశాఖమంత్రిత్వశాఖతో పాటు యువజన వ్యవహారాల శాఖను నిర్వహించారు.
కేంద్ర విద్యుత్ శాఖమంత్రి రాజ్‌కుమార్ సింగ్ విషయానికి వస్తే ఆయన బిహార్‌లో సీపీఐ (ఎంఎల్) చేతిలో 60వేల ఓట్లతో ఓడిపోయారు. ఇక నారాయణ రానే విషయానికి వస్తే మోదీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ మంత్రి … రత్నగిరి నుంచి గెలుపొందారు. మహారాష్ర్ట మాజీ సీఎం రాణే విషయానికొస్తే ఆయన 2019లో బీజేపీలో చేరారు. అటుతర్వాత ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇదే ఆయన మొదటిసారి లోకసభకు పోటీ చేసి గెలుపొందారు. ఇక రాజీవ్ చంద్రశేఖర్ విషయానికవ వస్తే స్కిల్ డెవలెప్‌మెంట్ డిపార్టుమెంట్‌తో పాటు ఎలక్ర్టానిక్స్, ఐటి, జలశక్తి మంత్రిగా సేవలందించారు. అయితే ఆయన తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శశిథరరూర్ చేతిలో ఓడిపోయారు. తన కోసం పనిచేసని కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మోదీతో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు తాను గౌరవంగా భావిస్తున్నానని తన ఎక్స్ ఖతాలో రాజీవ్ చంద్ర శేఖర్ చెప్పారు.