Site icon Prime9

Ashwini Vaishnav :దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Ashwini Vaishnav

Ashwini Vaishnav

Ashwini Vaishnav: దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుమారు 200 రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జాల్నాలో కోచ్‌ మెయింటీనెన్స్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే 47 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని.. 32 స్టేషన్లలో పనులు మొదలుపెట్టినట్లు అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 200 రైల్వేస్టేషన్లను ఆధునికీ కరించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ని ఇప్పటికే సిద్ధం చేసిందని అన్నారు. ఆధునిక సౌకర్యాలలో భాగంగా పిల్లల కోసం వినోద సౌకర్యాలతో పాటు వెయిటింగ్ లాంజ్‌లు, ఫుడ్‌కోర్టులతో ప్రపంచస్థాయి సదుపాయాలతో రైల్వే స్టేషన్లలో ఓవర్‌ హెడ్‌ స్పేస్‌లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

రాబోయే రోజుల్లో దేశంలో 400 వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయన్నారు. వీటిలో దాదాపు 100 రైళ్లు లాతూర్‌లోని కోచ్‌ ఫ్యాక్టరీలోనే తయారుకానున్నాయని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలు ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద ఇప్పుడు హైవేలు లేదా రైల్వేల ద్వారా అనుసంధానమయ్యాయని.. మరఠ్వాడాలోని కొన్ని ప్రాంతాలు సైతం అనుసంధానమవుతాయని అన్నారు. ఔరంగాబాద్‌ కోచ్‌ఫ్యాక్టరీలో కోచ్‌ల తయారీ సామర్థ్యాన్ని 18 నుంచి 24కి పెంచాలని మహారాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత అంబదాస్‌ దాన్వే డిమాండ్‌ చేయగా.. దీనిపై 15 రోజుల్లోగా ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Exit mobile version
Skip to toolbar