Site icon Prime9

Mizoram: వైద్యుడి పై దాడి చేసిన మిజోరాం సీఎం కుమార్తె మిలారీ చాంగ్టే

Mizoram: మిజోరాం సీఎం కుమార్తె మిలారీ చాంగ్టే వైద్యుడి పై దాడి చేసింది. అపాయింట్ మెంట్ లేకుండా క్లీనిక్ లోనికి అనుమతి లేదని చెప్పడంతో ఓ వైద్యుడి పై తన ప్రతాపం చూపించింది. విచక్షణ కోల్పోయిన వైద్యుడి పై దాడికి దిగింది. ఈ ఘటనతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మిజోరాం సీఎం వైద్యుడికి క్షమాపణలు చెప్పారు.

మిజోరాం సీఎం జోరంతంగా కుమార్తె మిలారీ చాంగ్టే రాజధాని ఐజ్వాల్‌లో ఓ క్లినిక్‌కు వెళ్లారు. అపాయింట్‌మెంట్ లేకుండా నేరుగా వైద్యుడి వద్దకు వెళ్లడంతో తాను చూడాలంటే అపాయింట్‌మెంట్ ఉండాల్సిందేనని డెర్మటాలజిస్ట్ ఆమెకు స్పష్టం చేశారు. దీంతో కోపంతో ఊగిపోయిన చాంగ్టే అందరూ చూస్తుండగానే వైద్యుడి పైకి దూసుకెళ్లి ముఖం పై పిడిగుద్దులతో దాడి చేశారు.

మరోవైపు, వైద్యుడి పై దాడిని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా నిరసనలకు దిగింది. నల్లబ్యాడ్జీలతో వైద్యులు విధులకు హాజరయ్యారు. దీంతో సీఎం జోరంతంగా దిగిరాక తప్పలేదు. తన కుమార్తె చేసిన తప్పునకు ఆయన బహిరంగ క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. డెర్మటాలజిస్టుతో తన కుమార్తె తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

Exit mobile version