Site icon Prime9

MiG 21: రాజస్థాన్ లో కూలిన యుద్ద విమానం.. ముగ్గురు మృతి

Mig 21

Mig 21

MiG 21: రాజస్థాన్ లో ఓ యుద్ద విమానం నేలకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరుణ ప్రాణాలు కోల్పోయారు. ఫైటర్ జెట్ మిగ్-21 అదుపుతప్పి ఓ ఇంటిపై పడిపోయింది. రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ముగ్గురు పౌరులు మృతి..

రాజస్థాన్ లో ఓ యుద్ద విమానం నేలకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరుణ ప్రాణాలు కోల్పోయారు. ఫైటర్ జెట్ మిగ్-21 అదుపుతప్పి ఓ ఇంటిపై పడిపోయింది. రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

భారత వాయుసేనకు చెందిన మిగ్‌-21 యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానం ప్రమాదవశాత్తు ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రోజువారి శిక్షణలో భాగంగా.. సూరత్‌గఢ్‌ ఎయిర్‌బేస్‌ నుంచి టేకాఫ్‌ అయ్యింది. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఇంటిపై కూలిపోయింది. ప్రమాదాన్ని ముందే గమనించిన పైలట్.. పారాచూట్ సాయంతో బయటకు దుకేశాడు.

ప్రమాదాన్ని ముందే గుర్తించడంతో.. ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ విమానం.. ఇంటిపై కూలడంతో ఇంట్లో ఉన్న ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలను చేపట్టాయి. ఘటనపై భారత వాయుసేన స్పందించింది. పైలట్‌ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపింది. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించింది.

తరచూ ప్రమాదాలు

భారత వాయుసేనకు చెందిన మిగ్ యుద్ద విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. 1971 యుద్ధంలో భారత్‌కు అద్భుత విజయాన్నందించిన ఈ రష్యన్‌ ఫైటర్‌జెట్లు ఇప్పుడు అపకీర్తి మూటగట్టుకుంటున్నాయి. 1971-72 నుంచి ఇప్పటివరకు 400 మిగ్‌-21 ఫైటర్‌ జెట్లు కూలిపోయినట్లు ఆంగ్ల మీడియా కథనాల సమాచారం. ఈ ప్రమాదాల్లో 200 మందికి పైగా పైలట్లు, దాదాపు 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Exit mobile version