Kerala: నెలసరి సమయంలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మరి ఆ సమయంలో వచ్చే నొప్పుల బాధ వర్ణనాతీతం. అది అనుభవించే వారికే తెలుస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను భరించలేక చాలా మంది యువతులు, మహిళలు ఉపసమనం కోసం ఇంజెక్షన్లు, మందులు వంటివి తీసుకుంటుంటారు. కాగా ఈ నొప్పుల బాధ తెలియని కొందరు పురుషులు ఆడవాళ్లను అవహేళన చెయ్యడం. ఆ నొప్పిని కూడా భరించలేవా అంటూ కామెంట్లు చెయ్యడం విని ఉంటాము. మరి ఆ నొప్పుల బాధను పురుషులు కూడా ఫేస్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. సరిగ్గా ఇలాంటి ఆలోచనే వచ్చిన ఓ గ్రూప్ పురుషుల కూడా పీరియడ్స్ బాధను ఎక్స్ పీరియన్స్ చేసేలా ఓ సర్వేను నిర్వహించింది.
కేరళ రాష్ట్రం ఎర్నాకులానికి చెందిన ఓ గ్రూపు మహిళలు పీరియడ్స్ గురించి బహిరంగంగా చర్చకు దిగింది. ఇందు కోసం పురుషుల పై ఓ వింత ప్రయోగం చేపట్టింది. సిమ్యులేటర్ మెషిన్ ద్వారా మగవాళ్లకు పీరియడ్స్ నొప్పులను కృత్రిమంగా కలిగిచింది. సిమ్యులేటర్ స్థాయి 4 దాటేసరికి మగవాళ్లు ఆ నొప్పులు భరించలేక కేకలు వేశారు. ఆ నొప్పిని మేము భరించలేమంటూ కొందరు చెప్పుకొచ్చారు.
అదే ప్రయోగాన్ని అమ్మాయిల పై చేపడితే సిమ్యులేటర్ స్థాయి 9 ఉన్నా వాళ్లు ఇబ్బంది పడలేదట. దీనితో పీరియడ్స్ నొప్పి భరించే మహిళలు చాలా గ్రేట్ అంటూ అక్కడున్న మగవాళ్లు అన్నారు.