Kuki community protest:మణిపూర్‌లోని కుకీ గిరిజన సంఘం సభ్యులు ఈరోజు న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం ముందు నిరసన చేపట్టారు. ఈ ఉదయం ఆందోళనకారులు షా నివాసానికి చేరుకుని ఆయనను కలవాలని డిమాండ్ చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. హోంమంత్రి నివాసం వెలుపల పోలీసులు భద్రతను పెంచారు. కొద్దిమంది నిరసనకారులను షాను కలిసేందుకు అనుమతించారని సమాచారం.
‘సేవ్ కుకి లైవ్స్’ అనే సందేశాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు నినాదాలు చేశారు. మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా జూన్ 7న మణిపూర్‌లోని కుకీ కమ్యూనిటీకి చెందిన ప్రజలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వెలుపల నిరసన తెలిపారు.ఒక నెల క్రితం మణిపూర్‌లో జరిగిన జాతి హింసలో కనీసం 98 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 310 మంది గాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 272 సహాయ శిబిరాల్లో 37,450 మంది ఆశ్రయం పొందారు.షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు నిరసనగా కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించిన తర్వాత మే 3న మణిపూర్‌లో మొదట ఘర్షణలు చెలరేగాయి.