Site icon Prime9

Amit Shah: తమిళంలో వైద్య మరియు సాంకేతిక విద్యను అందించాలి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

amit-shah

amit-shah

Chennai: తమిళ భాష మరియు దాని వ్యాకరణం ప్రపంచంలోనే పురాతనమైనవని వాటికి ప్రాచుర్యం తేవడం దేశం యొక్క బాధ్యత అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం చెన్నైలో జరిగిన ఇండియా సిమెంట్స్ ప్లాటినం జూబ్లీ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా తమిళంలో వైద్య మరియు సాంకేతిక విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

”ప్రపంచంలోని పురాతన భాషల్లో తమిళం ఒకటి. దీని వ్యాకరణం కూడా పురాతనమైనది. తమిళ భాషలో వైద్య మరియు సాంకేతిక విద్యను అందించాలని నేను తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. తద్వారా తమిళ మీడియం విద్యార్థులు ప్రయోజనం పొందగలరు. వారి మాతృభాషలో పరిశోధన మరియు అభివృద్ధిని నిర్వహించగలరు అని షా అన్నారు. ఈ చర్య తీసుకుంటే భాషకు పెద్దపీట వేస్తామని హోంమంత్రి చెప్పారు.

హిందీ విధింపుకు వ్యతిరేకంగా తమిళనాడు బలంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపధ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, అధికార భాష పై పార్లమెంటరీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న అమిత్ షా చేసిన సిఫార్సులు దేశ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. హిందీని విధించడం భారతదేశ సమగ్రతకు విరుద్ధం. గతంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల నుంచి బీజేపీ ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటే బాగుంటుందని ఆయన తన లేఖలో ప్రస్తావించారు.

 

Exit mobile version