Site icon Prime9

Surat: కుమార్తెను కత్తితో 25 సార్లు పొడిచి చంపి.. భార్యను గాయపరిచి.. సూరత్ వ్యక్తి నిర్వాకం

Surat

Surat

Surat: ఇంటి గొడవల కారణంగా తన కుమార్తెను కత్తితో కనీసం 25 సార్లు పొడిచి చంపి, భార్యను గాయపరిచినందుకు సూరత్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు.మే 18వ తేదీ రాత్రి సూరత్‌లోని కడోదర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టెర్రస్‌పై నిద్రతోనే..(Surat)

రామానుజ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సూరత్‌లోని సత్య నగర్ సొసైటీలో అద్దెకు ఉంటున్నాడు. తమ కుమార్తె టెర్రస్‌పై పడుకున్న విషయంపై భార్యతో జరిగిన చిన్నపాటి వాదనలో సహనం కోల్పోయాడు. దీనితో రాత్రి 11.20 గంటలకు, రామానుజు మొదట తన పిల్లల ముందే తన భార్యపై కత్తితో దాడి చేశాడు. మహిళ గాయపడగా, ఆమె పిల్లలు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతను తన కుమార్తెను పట్టుకుని, ఆమెను పలు సార్లు కత్తితో పొడిచాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతని పట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ సమీపంలోని గదిలోకి పరుగెత్తింది.. అయినప్పటికీ అతను ఆమెను వెంబడించి కత్తితో పొడిచి చంపేసాడు.

కుమార్తెను చంపిన అనంతరం భార్యపై దాడి చేయడానికి టెర్రస్ పైకి ఎక్కాడు. దీనితో అప్రమత్తమయిన పిల్లలు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తల్లితో పాటు వారికి కూడా గాయాలయ్యాయి. దీనితో సూరత్ పోలీసులు కడోదరలోని అతని ఇంటి వద్ద రామానుజను పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై హత్య, హత్యాయత్నం సహా ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఆర్‌కె పటేల్ తెలిపారు.తల్లి 10 కత్తిపోట్లకు గురయింది. ఆమె రెండు వేళ్లు నరికివేయబడటంతో చేతి వేళ్లను అటాచ్ చేయడానికి శస్త్రచికిత్స చేయబడింది . పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version